Take a fresh look at your lifestyle.

ఒక్క ఫిర్యాదు మేరకు గుడి గోడ తొలగింపు….

0

అనుమతి లేని అక్రమ కట్టడాల పై చర్యలేవి ?

* అనుమతి లేని అక్రమ కట్టడాల పై, కబ్జాదారులను వదిలేసి…
* చిన్న ఘటనపై బల్దియా శ్రద్ధ చూపడంలో అంతర్యమేమి?
* నాందేవాడలో ప్రహరీ గోడ కూల్చివేత పై విమర్శలు…

నిజామాబాద్ , జనవరి 04 (లోకంతీరు) : నిజామాబాద్ నగరపాలక సంస్థ పరిధిలో రోడ్డును ఆక్రమించి భవనాలు నిర్మించడం, అనుమతి లేని అక్రమ కట్టడాలు, కబ్జాదారులపై చర్యలు తీసుకొని బల్దియా చిన్న ఘటనపై టౌన్ ప్లానింగ్ శాఖ దృష్టి సారించడంపై విమర్శలు వ్యక్తమ‌వుతున్నాయి. నిజామాబాద్ నగరంలో మొత్తం 60డివిజన్ల పరిధిలో జోరుగా అక్రమ నిర్మాణాలు చేపడుతున్నప్పటికీ కార్పొరేషన్ శాఖ అధికారులు అటువైపు కన్నెత్తి కూడా చూడకపోవడం గమనార్హం.నగరంలోని 36 వ డివిజన్  నాందేడ్ వాడాలో అమ్మవారి ఆలయ ప్రహరీ గోడను కూల్చి వేయడానికి పోలీస్ బందోబస్తుతో వెళ్లడంపై నగర ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. చిన్న ఘటనపై టౌన్ ప్లానింగ్ శాఖ స్పందించి గోడను కూల్చివేయడం ఏమిటని కాలనీవాసులు ప్రశ్నిస్తున్నారు.నాందేవాడలోని ఆలయ ప్రహరీ వ్యవహారంలో స్పందించిన టౌన్ ప్లానింగ్ శాఖ అన్ని వ్యవహారాలలోనూ కూడా ఇదే విధంగా స్పందించి కబ్జా దారులపై కొరడా ఝులిపించాలి. ఇప్పటికైనా నగరపాలక సంస్థ కమిషనర్ టౌన్ ప్లానింగ్ శాఖపై దృష్టి సారించి ప్రక్షాళన చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని నగర ప్రజలు వాపోతున్నారు.

Leave A Reply

Your email address will not be published.