నిజామాబాద్ అర్బన్, జనవరి 04 ( లోకంతీరు ) : నిజామాబాద్ నగరంలోని నాందేవాడలో గల దుర్గామాత ఆ లయంలో ప్రహరీ గోడ కూల్చివేశారు. టౌన్ ప్లానింగ్ అధికారులు పోలీసులతో కలిసివచ్చి కూల్చివేయడంతో స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎవరో ఇచ్చిన పిటిషన్ను దేవుని ఆలయం ప్రహరీ గోడను ధ్వంసం చేయడంపై స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మున్సిపల్ కమిషనర్ ఆదేశాల మేరకే కూర్చువేశామని తెలిపారు పెద్ద మొత్తంలో పోలీస్ సిబ్బందితో కలిసి వచ్చి ఈ ప్రహారీ గోడ కూల్చివేయడంలో ఎవరి హస్తముందు అన్నది ప్రశ్నార్థకంగా మారింది.