Take a fresh look at your lifestyle.

గ్రామాల అభివృద్ధిలో సర్పంచులదే ప్రధాన పాత్ర….

0

చక్కటి పాలనతో గ్రామాల అభివృద్ధికి కృషి చేసిన ఘనత 2019- 2024 పీరియడ్ సర్పంచులే.

  • ఎంపీపీ వల్లేపల్లి సునీత శ్రీనివాస్.
  • గ్రామాల అభివృద్ధిలో సర్పంచులదే ప్రధాన పాత్ర.
  • ఎంపీడీవో,ఎమ్మార్వోలు.
  • మండల ప్రజాపరిషత్ కార్యాలయంలో సర్పంచ్లకు ఆత్మీయ వీడ్కోలు సభ.

బాన్సువాడ/కోటగిరి, జనవరి 31 (లోకం తీరు ) : చక్కటి పరిపాలన అందించి గ్రామాల అభివృద్ధికి అపారమైన కృషి చేసిన ఘనత 2019- 2024 పీరియడ్ సర్పంచ్ లకే దక్కుతుందని ఎంపీపీ వల్లేపల్లి సునీత శ్రీనివాస్ అన్నారు.బుధువారం కోటగిరి మండల కేంద్రంలోనీ మండల ప్రజాపరిషత్ కార్యాలయంలో ఎంపీపీ అధ్యక్షతన ఉమ్మడి కోటగిరి మండలంలోని సర్పంచ్లకు మండల ప్రజాపారిషత్ సిబ్బంది ఆత్మీయ వీడ్కోలు సన్మాన కార్యక్రమం నిర్వహించారు.ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ.రాష్ట్ర వ్యాప్తంగా ఫిబ్రవరి 1 తారీకున సర్పంచ్ల పదవీ కాలం ముగు స్తున్న సందర్భంగా ఉమ్మడి కోటగిరి మండల సర్పంచ్ లకు ఎంపీటీసీలు,అధికారులు, ప్రజా ప్రతినిధులు వీడ్కోలు అభినందనలు తెలిపారు.

బాన్సువాడ నియోజక వర్గంలోని ఉమ్మడి కోటగిరి మండలానికి చెందిన సర్పంచులు మాజీ శాసన సభాపతి,శాసన సభ్యులు పోచారం శ్రీనివాస రెడ్డి సహకారంతో గ్రామాలను అభివృద్ధి పథంలో నడిపించారనీ ఆన్నారు.పదవి కాలం ముగించిపోయిందని అనుకోకుండా సర్పంచులందరూ స్పెషల్ ఆఫీసర్లకు సహాయ సహకారాలు అందించాలని పేర్కొన్నారు.ప్రజాసేవ చేయాలనుకునే వారికి పదవి అవసరం లేదని.ప్రజాసేవ చేసే నాయకులకు విరామం విశ్రాంతి ఉండదని అన్నారు.ప్రతినిత్యం ప్రజల కష్ట సుఖాలను సమీక్షించే ఏకైక ప్రజా ప్రతినిధి సర్పంచులని కొనియాడారు. గ్రామాలలో శాశ్వత మౌలిక వసతులు,అవసరాలు ఏర్పాటు చేసిన ఘనత 2019-2024 పీరియడ్స్ సర్పంచ్ లకే దక్కుతుందని అన్నారు.ప్రభుత్వం ఇచ్చిన ఆదేశాల మేరకు గ్రామాలలో చేపట్టిన పనులకు సకాలంలో నిధులు రాకపోయినా పూర్తి చేశారని అన్నారు.అధికారులు ప్రజాప్రతినిధుల సమన్వయం తో కోటగిరి మండలాన్ని ఆదర్శవంతంగా తీర్చిదిద్దామని అన్నారు.ఈ కార్యక్రమంలో ఎంపీడీవో మనోహర్ రెడ్డి, ఎమ్మార్వోలు ప్రభాకర్,రమేష్, వైస్ ఎంపీపీ గంగాధర్ పటేల్, మార్కెట్ కమిటీ చైర్మన్ అబ్దుల్ హమీద్,కొత్తపల్లి సింగిల్ విండో చైర్మన్ డా.సునీల్ కుమార్, ఉమ్మడి మండల సర్పంచ్లు, ఎంపీటీసీలు,పంచాయతీ కార్యదర్శులు,ఆయా శాఖల అధికారులు,తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.