బాధ్యతలు స్వీకరించిన అదనపు కలెక్టర్ (స్థానిక సంస్థలు) అంకిత్

నిజామాబాద్, ఫిబ్రవరి 14 ( లోకంతీరు ) : నిజామాబాద్ జిల్లా అదనపు కలెక్టర్ గా (స్థానిక సంస్థలు) అంకిత్ బుధవారం బాధ్యతలు స్వీకరించారు. సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలోని తన చాంబర్ కు చేరుకుని బాధ్యతలు చేపట్టారు. అంతకుముందు ఆయన కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతును మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా వివిధ శాఖల అధికారులు అదనపు కలెక్టర్ కు స్వాగతం పలికి, పరిచయం చేసుకున్నారు. జిల్లా అదనపు కలెక్టర్ (స్థానిక సంస్థలు) గా కొనసాగిన చిత్రామిశ్రా ను ఏటూరునాగారం ఐటీడీఏ పీ.ఓ గా బదిలీ చేస్తూ, ఆమె స్థానంలో అక్కడ పనిచేసిన 2019 బ్యాచ్ ఐ.ఏ.ఎస్ అధికారి అంకిత్ ను నిజామాబాద్ జిల్లా అదనపు కలెక్టర్ (స్థానిక సంస్థలు) గా ప్రభుత్వం పోస్టింగ్ కల్పించింది. ఈ మేరకు అదనపు కలెక్టర్ అంకిత్ బుధవారం ఇక్కడికి చేరుకుని బాధ్యతలు స్వీకరించారు. కలెక్టరేట్ ఏ.ఓ ప్రశాంత్, కార్యాలయ సిబ్బంది, వివిధ శాఖల అధికారులు అదనపు కలెక్టర్ ను మర్యాదపూర్వకంగా కలిసి స్వాగతం పలికారు.