గొల్లపల్లి గ్రామ పాలకవర్గానికి పదవి విరమణ సన్మానం

రామారెడ్డి, ఫిబ్రవరి 2 (లోకం తీరు ) : రామారెడ్డి మండలం గొల్లపల్లి గ్రామంలో గ్రామ పాలకవర్గం ఐదు సంవత్సరాలు పూర్తి చేసిన సందర్భంగా పదవి విరమణ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్బంగా పంచాయతీ సెక్రటరీ జనార్ధన్ మాట్లాడుతూ పదవులు శాశ్వతం కావు ప్రజలకు సేవ చేయాలనే సంకల్పం కలిగి ఉండాలని, అదేవిధంగా ఉన్నత స్థాయిలో ఎదగాలని తెలిపారు.గ్రామస్తులు పాలకవర్గం కు శాలువా తో సన్మానించి మెమోంట్లు అందజేశారు. కార్యక్రంలో సర్పంచ్ మాట్లాడుతూ ఐదు సౌవత్సరాలు గ్రామ ప్రజలు మాకు సహకరించినందుకు గ్రామ ప్రజలందరికి పేరు పేరు న ధన్యవాదములు తెలుపుతూ రాభోయే పాలక వర్గానికి స్వాగతం తెలుపుతున్నాను అధికారం శాశ్వతం కాదు అందరం కలిసికట్టుగా గ్రామ అభివృద్ధికి తోడ్పడాలని కోరారు. ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు, ప్రజలు తదితరులు పాల్గొన్నారు.