Take a fresh look at your lifestyle.

బీజేపీ అధ్యక్షుడు దినేశ్ కు సన్మానం…….

0

బీజేపీ అధ్యక్షుడు దినేశ్ కు సన్మానం

  • బీసీ సంఘం అధ్వర్యంలో నిర్వహణ.
  • రాజకీయ, సామాజిక చైతన్యంతోనే బీసీల అభ్యున్నతి.
  • దేశ ప్రధానిగా బీసీ బిడ్డ నరేంద్ర మోడీ.

నిజామాబాద్, ఫిబ్రవరి 04 ( లోకం తీరు న్యూస్ ) : భారతీయ జనతా పార్టీ నూతన జిల్లా అధ్యక్షుడుగా ఎన్నికైన దినేష్ కులచారిని, జాతీయ బీసీ సంక్షేమ సంఘం జిల్లా కమిటీ అధ్వర్యంలో ఆదివారం ఘనంగా సన్మానించారు.సంఘం రాష్ట్ర కన్వీనర్ పోతన్కర్ లక్ష్మీ నారాయణ, జిల్లా అధ్యక్షులు కెంపుల నాగరాజు అధ్యక్షతన నిజామాబాద్ నగరంలోని ఆర్ అండ్ బీ గెస్ట్ హౌస్ లో సన్మాన కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా దినేశ్ మాట్లాడుతూ….కష్టపడి పనిచేస్తేనే గుర్తింపు ఉంటుందని, దీనికి తానే నిదర్శనమని పేర్కొన్నారు. ఎన్నో ఆటుపోట్లను ఎదుర్కొని, ప్రపంచంలోని అతి పెద్ద పార్టీకి, జిల్లా అధ్యక్షుడిగా ఎన్నిక కావడం తన అదృష్టంగా భావిస్తున్నానని గర్వపడ్డారు. ఉన్నత స్థానాలకు చేరుకునేలా, బీసీ నాయకులు పని చేయాలని దిశానిర్దేశం చేశారు. 

వేదిక ఏదైనా, సహచర బీసీ నాయకులు ఉన్నత స్థానాల్లో ఉండటం ఆనందంగా ఉందన్నారు. ఉన్నతమైన ఆశయాలతో ముందుకు వెళుతున్న జాతీయ బీసీ సంక్షేమ సంఘానికి తన సంపూర్ణ మద్దతు ఉంటుందన్నారు. దేశ ప్రధానిగా బీసీ బిడ్డ నరేంద్ర మోడీ ఉండటం తమందరికి గర్వకారణమన్నారు. రాజకీయ, సామాజిక చైతన్యంతోనే బీసీల అభ్యున్నతి జరుగుతుందని గుర్తు చేశారు. ఎందరో గొప్ప బీసీ నేతలు దేశంలో రాజ్యమేలారని, వారిని స్ఫూర్తిగా తీసుకోవాలన్నారు. వెనుకబడిన వర్గాలు ఇకనైనా మేల్కొని, ఉన్నత స్థానాల్లోకి రావాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో బీసీ జేఏసి జిల్లా అధ్యక్షులు బొబ్బిలి నర్సయ్య, సంఘం ఉపాధ్యక్షులు రామడుగు బాల కిషన్, రాష్ట్ర కార్యదర్శి సుజిత్ సింగ్, జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ వినోద్, రాష్ట్ర నాయకులు హన్మంత్ రావు, బీసీ ఉద్యోగుల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రేవంత్, రాష్ట్ర నాయకులు సాయ గౌడ్, భాస్కర్, వినోద్, జిల్లా మహిళా విభాగం అధ్యక్షురాలు స్వప్న, కార్యదర్శి లావణ్య, రాష్ట్ర నాయకురాలు తేలు సరిత, నగర అధ్యక్షులు రతన్, జిల్లా ఉపాధ్యక్షులు లక్ష్మణ్ రావు, శ్యాం, నాయకులు శివకుమార్, చింతకాయల రాజు, సురేష్, విద్యార్థి విభాగం అధ్యక్షులు నవతే ప్రతాప్, కృష్ణ, అంబటి శ్రీనివాస్ గౌడ్, ఈరుముల శ్రీనివాస్, కస్తూరి కృష్ణ, చైతన్య చంద్ర, అమంద్ ప్రవీణ్, యోగేశ్వర్, హైమద్, సంఘ నాయకులు, సభ్యులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.