ప్రభుత్వ సలహాదారు పొద్దుటూరి సుదర్శన్ రెడ్డికి ఘనంగా సన్మానం
– ఎడపల్లి మండలప్రెస్ క్లబ్ అధ్యక్షులు కదం ప్రకాష్
ఎడపల్లి, నవంబర్ 07 ( లోకంతీరు ) : బోధన్ నియోజకవర్గ శాసనసభ్యులు పొద్దుటూరి సుదర్శన్ రెడ్డికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ సలహాదారునిగా నియామకం చేయడం హర్షినియమని ఎడపల్లి మండల ప్రెస్ క్లబ్ అధ్యక్షులు కదం ప్రకాష్ తెలిపారు ఉమ్మడి రాష్ట్రంలో బోధన్ ఎమ్మెల్యే పొద్దుటూరి సుదర్శన్ రెడ్డి వైద్య విద్య భారీ నీటిపారుదల శాఖ మంత్రి గా పని చేసి రాష్ట్ర అభివృద్ధితోపాటు ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో ఎంతగానో అభివృద్ధి చేశారని ఆయన అన్నారు జిల్లా కేంద్రంలో మెడికల్ కళాశాల ఏర్పాటు చేయడం వల్ల ఎంతోమంది విద్యార్థులకు ఎత్తిపోతల పథకం నిర్మాణం పనులు చేపట్టి రైతులకు ఆదుకున్న ఘనత ప్రభుత్వ సలహాదారునికే దక్కిందన్నారు అలాగే బోధన్ నియోజకవర్గంలో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేసిన ఘనత పొద్దుటూరి సుదర్శన్ రెడ్డి అని తెలిపారు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సలహాదారునిగా నియమించడం పట్ల సీఎం రేవంత్ రెడ్డికి మంత్రులకు ఎమ్మెల్యేలకు ఎడపల్లి మండల ప్రెస్ క్లబ్ అధ్యక్షులు కదం ప్రకాష్ ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు అంతకు ముందుగా ప్రభుత్వ సలహాదారునిగా నియామకమైన పొద్దుటూరి సుదర్శన్ రెడ్డికి ఘనంగా సన్మానించి పుష్పగుచ్చాన్ని అందించి శుభాకాంక్షలు తెలిపారు.