Take a fresh look at your lifestyle.

కాంగ్రెస్ పార్టీ ప్రతి హామీని పకడ్బందీగా అమలు చేస్తుంది….

0

కాంగ్రెస్ పార్టీ ప్రతి హామీని పకడ్బందీగా అమలు చేస్తుంది.

  • డీసీసీ డెలిగేట్ సభ్యులు కొట్టం మనోహర్.

కోటగిరి, జనవరి 24 ( లోకం తీరు ): ఎన్నికలలో ఇచ్చిన ఆరు గ్యారంటీలతో పాటుగా రైతు రుణమాఫీని కాంగ్రెస్ పార్టీ వంద రోజుల్లో పకడ్బందీగా అమలు చేస్తుందని డీసీసీ డెలిగేట్ సభ్యులు,కోటగిరి ఎంపీటీసీ కొట్టం మనోహర్ పేర్కొన్నారు.బుధవారం ఆయన కోటగిరి మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికలలో తెలంగాణ ప్రజలకు కాంగ్రెస్ పార్టీ ఆరు గ్యారంటీలతో పాటుగా రైతు రుణమాఫీ వంటి ప్రజారంజక హామిలను ప్రకటించింది.అందుకు ప్రజలు కాంగ్రెస్ పార్టీనీ గౌరవించి అధికారాన్ని ఇచ్చారు.

అధికారం వచ్చి 40 రోజుల్లోనే కాంగ్రెస్ పార్టీ పైన విమర్శలు చేయడం సరైంది కాదన్నారు.వంద రోజుల్లో ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవే ర్చెందుకు అవకాశం ఇవ్వకుండా బాన్సువాడ శాసన సభ్యులు పోచారం శ్రీనివాస్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ హామీలు 420 హమీలని మాట్లాడటం పట్ల ఆయన తీవ్రంగా ఖండించారు.బిఆర్ఎస్ ప్రభు త్వంలో సంబంధిత నాయకులు,కార్యకర్తలు ఎన్ని 420 పనులు చేశారో పోచారని కి తెలియదా అని అన్నారు. నియోజక వర్గంలో 11 వేల డబుల్ బెడ్ రూమ్లు కట్టించాం అని గొప్పగా చెప్పుకునే పోచారం శ్రీనివాస్ రెడ్డి అందులో మీ కార్యకర్తలు ఎంతల అవకతవక లకు పాల్పడ్డారో ఎంతాల 420 గా వ్యవహరించారో తెలుసుకోవాలని హెగ్దేవ చేశారు.డబుల్ బెడ్ రూమ్ బిల్లును ఎక్కడి కక్కడ బిఆర్ఎస్ కార్యకర్తలు తీసుకొని ఒక్కొక్కరికి ఒక్కొక్కలా బిల్లులు ఇచ్చి కొన్ని బిల్లులను వాడుకోవడంతో లబ్ధిదారులు నానా అవస్థలు పడుతున్నారనీ అన్నారు. కాంట్రాక్టర్ రాజేందర్ రెడ్డి డబుల్ బెడ్ రూమ్ లబ్ధిదారుల తో దురుసుగా మాట్లాడకుండ మర్యాదగా మాట్లాడితే బాగుంటదని హెచ్చరించా రు.


నియోజకవర్గంలోని సోమేశ్వరంలో ఉన్న క్రషర్ నిర్వహుకులు 40 లక్షల విద్యుత్ బకాయిలు చెల్లించక సంబంధిత అధికారులకు అనేక భయ భ్రాంతులకు గురిచేసిన సంఘటన 420 కాదా అని ప్రశ్నించారు.రాంపూర్ క్రషర్ విషయంలో పర్మిషన్లు లేకుండా ఇష్టానుసారంగా ఆరు ఎకరాల కు పెట్టు కొని అరవై ఎకరాలలో గుట్టలను తోడెయ్యడం 420 పని కాదా అని అన్నారు. పెండింగ్ బిల్లుల కోసం ఎదురు చూస్తూ నానా అవస్థలకు గురైత్తున్న డబల్ బెడ్ రూమ్ లబ్ధిదారులకు వెంటనే పెండింగ్ బిల్లులను చెల్లించాలి లేని పక్షంలో కలెక్టర్ కి కంప్లైంట్ చేయడం జరుగుతుందని ఆయన అన్నారు.ఈ ప్రెస్ మీట్లో కాంగ్రెస్ పార్టీ జిల్లా ఉపాధ్యక్షులు గంగాధర్ దేశాయ్,మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు షాహిద్ హుస్సేన్, సీనియర్ నాయకులు కార్య కర్తలు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.