Take a fresh look at your lifestyle.

సమయపాలన పాటించని రెవెన్యూ అధికారులు…..

0

సమయపాలన పాటించని రెవెన్యూ అధికారులు.

  • అధికారుల కోసం ప్రజల పడిగాపులు

  • పట్టించుకోని ఉన్నతధికారులు

  • తక్షణమే తాగు చర్యలు తీసుకోవాలి 

బాన్సువాడ/కోటగిరి, ఫిబ్రవరి 27 ( లోకంతీరు) : పోతంగల్ రెవెన్యూ కార్యాలయంలో అధికారులు,సిబ్బంది సమయపాలన పాటించడం లేదు.ఉదయం 10:30 గంటలకే విధులకు హాజరుకావల్సిన అధికారులు,సిబ్బంది గంటల తరబడి ఆలస్యంగా వస్తున్న పట్టించుకునే వారే లేరు.తద్వారా కార్యాలయంలో కుర్చీలు ఖాళీగా కనిపిస్తున్నాయి. ఉన్నత అధికారి కోసం ప్రజల ఎదురుచూపులు తప్పడం లేదు.ఎన్నో ఆశలతో ప్రభుత్వ కార్యాలయాలకు వచ్చిన వారి సమస్యలు వినేవారు లేకపోవడంతో చేసేదేమీ లేక నిరుత్సాహంతో ప్రజలు వెను తిరుగుతున్నారు. ఇప్పటికైనా సమయపాలన పాటించని ఉద్యోగులను గుర్తించి సస్పెండ్ చేయాలని ప్రజలు ఉన్నత అధికారులను ఉన్నత కోరుకుంటున్నారు

Leave A Reply

Your email address will not be published.