Take a fresh look at your lifestyle.

కామారెడ్డి జిల్లా ఏఐటీయూసీ మూడవ జిల్లా మహాసభ….

0

కామారెడ్డి జిల్లా ఏఐటీయూసీ మూడవ జిల్లా మహాసభ

  • ఏఐటీయూసీ కామారెడ్డి జిల్లా నూతన కమిటీ ఎన్నిక…!

కామారెడ్డి జిల్లా ప్రతినిధి , మార్చ్ 11 ( లోకంతీరు ) : కామారెడ్డి జిల్లా కేంద్రంలో ఏఐటీయూసీ మూడవ జిల్లా మహాసభలను ఘనంగా నిర్వహించారు.ఈ జిల్లా మహాసభ కామారెడ్డి పట్టణ మున్నూరు కాపు సంఘంలో నిర్వహించరు. ఏఐటీయూసీ జెండాను ఏఐటీయూసీ రాష్ట్ర కార్యదర్శి ఎస్ బాలరాజు ఆవిష్కరించిన అనంతరం ఏఐటీయూసీ గతంలో పనిచేసి మృతి చెందిన కార్మికులకు రెండు నిమిషాలు మౌనం పాటించరు. అనంతరం మహాసభ సభను పి బాలరాజ్ అధ్యక్షతన నిర్వహించారు. రాష్ట్ర కార్యదర్శి మాట్లాడుతూ స్వాతంత్ర పోరాటంలో పోరాడిన చరిత్ర కలిగిన సంఘం ఏఐటీయూసీ అని ఆయన అన్నారు. 1920 సంవత్సరం లో పుట్టినటువంటి ఏకైక సంఘం ఏఐటీయూసీ అని, మనదేశంలోని అతిపెద్ద కార్మిక సంఘంగా అవతరించి కార్మిక హక్కుల కోసం నిలబడు తూ సమస్యల ఉద్యమాలు నిర్వహిస్తూ దేశంలో అనేక కార్మిక చట్టాలను తీసుకువచ్చిందని పేర్కొన్నారు. స్వాతంత్ర ఉద్యమంలో పోరాటంలో అనేకమంది కార్మిక నాయకులు హక్కుల కోసం పోరాడుతూ దేశ స్వతంత్రం కోసం తమ జీవితాలను త్యాగం చేశారని, లాలాజపతిరాయ్, బాల్ గంగాధర్ తిలక్, సుభాష్ చంద్రబోస్, వివి గిరి, ఎన్ ఎన్ డాంగే , ఇంద్ర జీత్ గుప్త లాంటి మహా నాయకులు ఈ కార్మిక సంఘంలో పనిచేశారని అన్నారు. ప్రస్తుత పాలకులు కార్మిక చట్టాలను కనీస వేతనాలు ఈఎస్ఐ, పీఎఫ్ లను అనేక పోరాటాల ద్వారా సాధించుకుంటే నేటి పాలకులు వాటిని అంబానీ ఆదానీలకు అనుకూలంగా అమలు చేస్తున్నారని, కార్మికులకు కనీస వేతనాలు, పని భద్రత, గంటల తరబడి నిరంతరం పని చేయించుకుంటున్నారన్నారు. అనేక త్యాగాలతో పోరాడి సాధించుకున్న 44 కార్మిక చట్టాలను రద్దుచేసి వాటి స్థానంలో నాలుగు లేబర్ కోడ్ ల ను తీసుకువచ్చి కేంద్ర ప్రభుత్వము 12 గంటలు పని విధానం అమలు చేస్తుందని, ప్రభుత్వ సంస్థలైన బ్యాంకింగ్, రైల్వే, విద్యుత్, రవాణా రంగం, విమానరంగం, ఎల్ఐసి లాంటివి కనీస వేతనాలు లేక నేటి పాలకులు అమలు చేయక కార్మికులు ఈఎస్ఐ, పీఎఫ్ సౌకర్యం లేక సమాన పనికి సమాన వేతనం రాక, అన్ని రంగాలను ప్రైవేటు పరం చేస్తుందని అన్నారు. ఈ కార్యక్రమంలో ఏఐటీయూసీ కామారెడ్డి జిల్లా బాధ్యులు వై ఓమయ్య, ఏఐటీయూసీ జిల్లా అధ్యక్షులు పి బాలరాజ్, జిల్లా ఉపాధ్యక్షులు దుబాస్ రాములు, దశరథ్, మధ్యాహ్న భోజనం పథక సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు చక్రపాణి తదితరులు పాల్గొన్నారు.

ఏఐటీయూసీ కామారెడ్డి జిల్లా నూతన కమిటీ ఎన్నిక…!

మహాసభ తర్వాత ఏఐటీయూసీ జిల్లా నూతన కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకోన్నారు. ఏఐటీయూసీ జిల్లా అధ్యక్షులుగా జి రాజేందర్, ఉప అధ్యక్షులుగా డి రాములు, ఎండి రఫీక్, రాజిరెడ్డి, బి బాలరాజు, ( పిట్లం ) ప్రధాన కార్యదర్శిగా (కామారెడ్డి) పి బాలరాజ్, సహాయ కార్యదర్శులుగా సాయిలు, రేణుక, జిల్లా కోశాధికారిగా శంకర్, కమిటీ సభ్యులుగా లక్ష్మణ్, బాలాజీ, రాజమణి, సోఫియా, మల్లవ్వ, రియాజుద్దీన్, ఎం ఎల్లేషన్, రాజులు , సిద్ధిరాములు, కే సాయిలు, అనంతు, డి సాయిలు, ఏ కృష్ణ, సిహెచ్ సురేష్, జి రాజు, ఆర్ లక్ష్మణ్, వై రాజు, ఏ రాజు, తదితరులను నూతన కమిటీ సభ్యులుగా ఎన్నుకున్నారు. ఈ మహాసభకు కామారెడ్డి జిల్లా నలుమూలల నుండి 250 మంది కార్మికులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.