Take a fresh look at your lifestyle.

హలో బీసీ చలో పంజాబ్….

0

హలో బీసీ చలో పంజాబ్

• ఆగస్టు 7న జరిగే ఓబిసి మహాసభను జయప్రదం చేయండి

• బీసీల వాటా బీసీలకు దక్కాల్సిందే

• బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు జోగు నరసయ్య

బాల్కొండ నియోజకవర్గం ప్రతినిధి, ఆగస్టు 02 ( లోకంతీరు ) : ముప్కాల్ మండల కేంద్రంలో జోగు నరసయ్య ఆధ్వర్యంలో (రవీంద్ర) ఆగస్టు 7న పంజాబ్ లోని అమృత్సర్ లో జరిగే జాతీయ ఓబీసీ 9వ మహాసభ పోస్టర్ ను ఆవిష్కరించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు జోగు నరసయ్య పాల్గొని మాట్లాడుతూ దేశ జనాభాలో 60 శాతం ఉన్న బీసీల పట్ల కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అవ్వలబిస్తున్న వ్యతిరేక విధానాలను నిరసిస్తూ దేశంలోనే అన్ని రాష్ట్రాల నుండి వస్తున్న దాదాపు పదివేల మంది ముఖ్యమైన డెలికేట్స్ తో పంజాబ్ లోని అమృత్ సర్ లో జాతీయ ఓబీసీ 9వ మహాసభ ఏర్పాటు చేయడమైనది అని అన్నారు కేంద్ర ప్రభుత్వం వెంటనే కులగనున్న చేపట్టి బీసీల లెక్క తేల్చాలని కేంద్రంలో బీసీ మంత్రి శాఖ ఏర్పాటు చేయాలని చట్టసభల్లో బీసీ రిజర్వేషన్ ఇవ్వాలని ప్రధాన డిమాండ్తో ఈ మహాసభ ఏర్పాటు చేయడం జరుగుతుంది కావున ఈ మహాసభకు బీసీలు పెద్ద ఎత్తున తరలివచ్చి బీసీల సత్తా చాటాలని పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో,బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు జోగు నరసయ్య,ద్యాగా శేఖర్ బీసీ విద్యార్థి సంఘం జిల్లా జనరల్ సెక్రెటరీ,జోగు నరేందర్, కృష్ణ,జక్కుల జీవన్, అనికేశ్, కృష్ణ, పృథ్వి వల్లం, సుదర్శన్,పెంటు భూమేష్, నందన్ గౌడ్,వంశీ, సాయి కిరణ్ పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.