కిసాన్ నగర్ పాఠశాలలో దుస్తుల పంపిణి

బాల్కొండ నియోజకవర్గం ప్రతినిధి, ఆగస్టు 06 ( లోకంతీరు ) : బాల్కొండ మండలం కిసాన్ నగర్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థులకు మంగళవారం 2001-02 బ్యాచ్ విద్యార్థులు ఆట దుస్తులు పంపిణీ చేశారు. పాఠశాల చదువుతున్న అన్ని తరగతులకు చెందిన 99 మంది విద్యార్థులకు దుస్తులు అందజేశారు. ప్రధానోపాధ్యాయులు రాజేంద్ర కుమార్, ఉపాధ్యాయులు, పూర్వ విద్యార్థులు , గ్రామస్తులు తదితరులు కార్యక్రమంలో పాల్గొన్నారు. విద్యార్థులకు దుస్తులు పంపిణీ చేసిన పూర్వ విద్యార్థులను గ్రామస్తులు అభినందించారు.