బాసర వేద పాఠశాల విద్యార్థి అనుమానస్పద స్థితిలో మృతి
-
వేద విద్యార్థి పై దాడి ఘటన మరువక ముందే మరొక ఘటన…
-
అనుమానాలకు తావిస్తున్న చిన్నారుల వరస సంఘటనలు…
-
పవిత్ర పుణ్యక్షేత్రం బాసరలో వేద పాఠశాల విద్యార్థులపై జరుగుతున్న సంఘటనలు కలగలం రేపుతున్నాయి.

ముధోల్, ఏప్రిల్ 04 ( లోకంతీరు ) : పవిత్ర పుణ్యక్షేత్రం చదువుల తల్లి శ్రీ జ్ఞాన సరస్వతి కొలువైనటువంటి బాసర లోని వేద పాఠశాల చిన్నారుల పై ఘటనలు కలకలం రేపుతున్నాయి. గత మార్చి నెలలో వేద పాఠశాల విద్యార్థి పై దాడి ఘటన మరువకముందే మరొక విద్యార్థి అనుమానాస్పదంగా మృతి చెందిన సంఘటన శుక్రవారం వెలుగులోకి వచ్చింది. వివరాల్లోకి వెళితే వరంగల్ జిల్లా కేంద్రానికి చెందిన మణికంఠ (16) అనే వేద పాఠశాల విద్యార్థి వేద పాఠశాలలో మూడవ సంవత్సరం చదువుతున్నాడు. కాగా ఉదయం పాఠశాల నుంచి అదృశ్యమై అతడు బాసర గోదావరి నదిలోని గంగా హారతి ఘాట్ – 2 లో శవమైతేలాడు. నది ఒడ్డున గల విద్యుత్ మోటారు వైరు కనెక్షన్ ఇవ్వడానికి ప్రయత్నించగా విద్యుత్తు షాక్కు తగిలి విద్యార్థి మృతి చెందినట్లు స్థానికులు తెలిపారు. ఏదేమైనాప్పటికీ వేద పాఠశాల నిర్వాహకులు విద్యార్థుల ద్వారా ఇలాంటి పనులు చేయించడంతో అమాయకమైన విద్యార్థుల ప్రాణాలు గాల్లో కలిసిపోవడం హృదయ విధారకమాన ఘటనని వాపోతున్నారు. గత మార్చ్ 21న వేద పాఠశాల విద్యార్థిపై దాడి ఘటన మరువకముందే తాజాగా అదే పాఠశాలలోనీ విద్యార్థి చనిపోవడం పలు అనుమానాలకు తావిస్తోంది. ఆ వేద పాఠశాలలో నిఘా నేత్రాలు (సి సి ఫుటేజ్ ) మాయమైనట్లు సమాచారం.ఈ ఘటన సంబంధించి పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది. ఈ విషయమై బాసర ఎస్సై గణేష్ దర్యాప్తు చేస్తున్నట్లు తెలిసింది