Take a fresh look at your lifestyle.

లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి ….

0

లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి 

– బాధితులను పరామర్శించిన అర్బన్ ఎమ్మెల్యే ధన్ పాల్…

నిజామాబాద్, ఆగష్టు 01 ( లోకంతీరు న్యూస్ ) : నగరంలోని లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అర్బన్ ఎమ్మెల్యే ధన్ పాల్ సూర్యనారాయణ గుప్తా తెలిపారు. శనివారం 42వ డివిజన్లోని చంద్రశేఖర్ కాలనీలో ఇవల ఎడతెరిపిలేని వర్షం కారణంగా షేక్ ఫిరోజ్ ఇళ్లు కూలిపోవడంతో పరామర్శించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ…వర్షం కారణంగా ఇబ్బందులు ఏర్పడితే అధికారులకు, స్థానిక కార్పొరేటర్లకు సంప్రదించాలని కోరారు. సంబంధిత అధికారులు సైతం లోతట్టు ప్రాంతాలపై దృష్టి సారించి, ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు కలుగకుండా చూడాలని సూచించారు. అలాగే ఇందిరమ్మ ఇళ్లు కూడా మంజూరు చేసేందుకు ప్రయత్నిస్తానని చెప్పారు. అనంతరం నెలవారి నిత్యవసర సరుకులతో పాటు ఆర్థిక సాయం అందించారు. కార్యక్రమంలో స్థానిక కార్పొరేటర్ బెల్లాల్ శశాంక్, 19వ డివిజన్ కార్పొరేటర్ నాగోల్ల లక్ష్మీనారాయణ, పసునూరి రాము, జ్యోతి మురళి, బంటు ప్రీతి ప్రవీణ్, ప్రసూన శ్రీనివాస్, శ్యామల సత్యపాల్ తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.