అర్బన్ లో డబుల్ బెడ్ రూమ్ టవర్లు నిర్మించాలి
– అర్హులందరికీ ఇళ్లు ఇవ్వాలి..
– అర్బన్ ఎమ్మెల్యే ధన్ పాల్ సూర్యనారాయణ

నిజామాబాద్ , ఆగష్టు 22 ( లోకంతీరు న్యూస్ ) : నియోజకవర్గంలో స్థలం లేని వారికి డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల టవర్లను నిర్మించి ఇవ్వాలని అర్బన్ ఎమ్మెల్యే ధన్ పాల్ సూర్యనారాయణ తెలిపారు. నగరంలోని రాజీవ్ గాంధీ ఆడిటోరియంలో డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల పట్టాలను అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ…నగరంలో పేదలకు స్థలం ఉండే అవకాశం లేదని, కావున ప్రభుత్వ స్థలంలోనే హైదరాబాద్ తరహాలో డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల టవర్లను నిర్మించాలని కోరారు. ప్రధానంగా రెండు దశల్లో గత 12 సంవత్సరాలుగా తెలంగాణలో డబుల్ బెడ్ రూం ఇళ్లు ఇవ్వని నియోజక వర్గం కేవలం నిజామాబాద్ అర్బన్ మాత్రమే అన్నారు. ఇప్పటికైనా ఇవ్వడం సంతోషకరమన్నారు. ఇటీవల మంత్రి పొంగిలేటి శ్రీనివాస్ రెడ్డి దృష్టికి ఇందిరమ్మ ఇల్లు, డబుల్ బెడ్ రూమ్ ఇళ్లకి సంబంధించి పలు అంశాలను తీసుకెళ్లానని గుర్తు చేశారు. కార్యక్రమంలో బీజేపీ కార్పొరేటర్లు పాల్గొన్నారు.