మంత్రితో కలిసి ప్రభుత్వ స్థలం పరిశీలన

నిజామాబాద్ , ఆగష్టు 22 ( లోకంతీరు న్యూస్ ) : నగరంలో స్థలం లేని వారికోసం డబుల్ బెడ్ రూమ్ టవర్ల నిర్మాణం కొరకు మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డితో కలిసి అర్బన్ ఎమ్మెల్యే ధన్ పాల్ సూర్యనారాయణ శనివారం ప్రభుత్వ స్థలాన్ని పరిశీలించారు. నగరంలోని నాగారం స్టేడియం వద్ద గల రెండెకరాల స్థలాన్ని పరిశీలించారు. అలాగే కలెక్టరేట్ వద్ద గల డబుల్ బెడ్ రూమ్ లను కూడా పరిశీలించి వివరాలను ఆరా తీశారు. అసంపూర్తిగా ఉన్న ఇళ్లను పూర్తి చేయాలని, మరమ్మతులు చేయాలన్నారు. వీలైనంత తొందరగా అర్హులైన పేదలకు అందుబాటులోకి తీసుకురావాలన్నారు.