ప్రజా నేతల పట్ల ఖమ్మం జిల్లా సీపీ సునీల్ దత్ వైఖరిని ఖండించండి.
– ప్రజాపంథా నాయకులపై పెట్టిన అక్రమ కేసులు ఎత్తివేయాలి.
– CPI(ML) ప్రజాపంథా డిమాండ్.

నిజామాబాద్ ,ఫిబ్రవరి 06 ( లోకం తీరు ) : ప్రజా సమస్యలపై అనునిత్యం పోరాడే CPI (ML) మాస్ లైన్ (ప్రజాపంథా) పార్టీ రాష్ట్ర నాయకులు ఆవుల అశోక్, సి.వై పుల్లయ్య, ప్రజా సంఘాల నాయకులు తిమ్మిడి హనుమంతరావు, నునావత్ శీను, గడ్డం లక్ష్మణ్ తదితరులను ఖమ్మం పోలీస్ కమీషనర్ సునీల్ దత్,IPS రౌడీషీటర్లని దుర్భాషలాడి, వారిపై అక్రమ కేసులు నమోదు చేసి, జైలుకు పంపడాన్ని నిరసిస్తూ CPI(ML) ప్రజాపంథా నిజామాబాద్ డివిజన్ కమిటీ ఆధ్వర్యంలో పూలాంగ్ చౌరస్తాలో అంబేద్కర్ విగ్రహం ముందు నిరసన ప్రదర్శన నిర్వహించడం జరిగింది.
ఈ సందర్భంగా CPI(ML) ప్రజాపంథా రాష్ట్ర నాయకులు ఎం.నరేందర్, డివిజన్ కార్యదర్శి ఎం.వెంకన్న లు మాట్లాడుతూ
ప్రజాపంథా రాష్ట్ర నాయకులు ఆవుల అశోక్, సీవై పుల్లయ్య నాయకులు తిమ్మిడి హనుమంతరావు, అరుణోదయ గడ్డం లక్ష్మణ్, జీ.అశోక్, నునావత్ శ్రీను లపై అక్రమ కేసులు పెట్టి జైలుకు పంపించడాన్ని వారు తీవ్రంగా ఖండించారు. ప్రజా నాయకులను నేర ప్రవృత్తి కలిగి ఉన్నారని, రౌడీ షీటర్లని, అమానుష వ్యాఖ్యలను చేసినటువంటి ఖమ్మం పోలీస్ కమీషనర్ సునీల్ దత్, ఐపీఎస్ పై ప్రభుత్వం చర్య తీసుకోవాలని వారి డిమాండ్ చేశారు. నిత్యం ప్రజా ఉద్యమాలు కార్మిక సమస్యలపై నిరంతరం పోరాటం చేస్తూ సిపిఐ ఎంఎల్ ప్రజాపంథా (మాస్ లైన్) నాయకులపై పెట్టిన కేసులు ఎత్తివేయాలని, ఉద్యమ సమయంలో పెట్టిన కేసులను సాకుగా చూపి రౌడీ షీటర్ కేసులు పెట్టడాన్ని ప్రజలు ప్రజాస్వామిక వాదులు ఖండించాలని, అక్రమ కేసులో జైలుకు పంపించిన వారిని వెంటనే విడుదల చేయాలని వారు డిమాండ్ చేశారు.
ఈ కార్యక్రమంలో CPI(ML) ప్రజాపంథా డివిజన్ సహాయ కార్యదర్శి సిహెచ్ సాయగౌడ్, నగర కార్యదర్శి ఎం.సుధాకర్, POW జిల్లా ప్రధాన కార్యదర్శి కే.సంధ్యారాణి, IFTU జిల్లా నాయకులు డి.కిషన్, బి.మురళి, టి.విటల్, డి.కిరణ్, సాయరెడ్డి, PDSU జిల్లా ప్రధాన కార్యదర్శి కే.గణేష్, నగర అధ్యక్షులు అషుర్ PYL జిల్లా ఉపాధ్యక్షులు సాయిబాబ, నాయకులు బి.లింగం, రవి, లలిత, గంగాధర్, సాయరెడ్డి తదితరులు పాల్గొన్నారు.