రథోత్సవ వేడుకలకు మాజీ ఎమ్మెల్యే కు ఆహ్వానం
–– మాజీ ఎమ్మెల్యే జాజాల సురేందర్
కామారెడ్డి ప్రతినిధి, ఏప్రిల్ 07 ( లోకంతీరు ) : రామారెడ్డి మండల కేంద్రంలోని శ్రీ సీతారామచంద్రస్వామి శ్రీ రాజరాజేశ్వర స్వామి బ్రహ్మోత్సవాల భాగంలో సోమవారం మాజీ ఎమ్మెల్యే జాజాల సురేందర్ ఆధ్వర్యంలో పోస్టర్ను ఆవిష్కరించి, రథోత్సవ వేడుకలకు ఆహ్వానించడం జరిగినది. ఈ కార్యక్రమంలో రామారెడ్డి మండల మాజీ ఎంపీపీ దశరత్ రెడ్డి, టెంపుల్ డైరెక్టర్ కడెం శ్రీకాంత్, ఆలయ మాజీ అభివృద్ధి కమిటీ అధ్యక్షులు పడిగెల శ్రీనివాస్, ఉత్సవ కమిటీ ఉపాధ్యక్షులు శంకర్ గౌడ్,సెక్రెటరీ కుశనోళ్ళ రమేష్,బిఆర్ఎస్ మాజీ కార్యదర్శి మైపాల్, బిఆర్ఎస్ సీనియర్ నాయకులు కాసర్ల స్వామి,మధుసూదన్ రెడ్డి, ధరణి ప్రవీణ్ కుమార్ పాల్గొనడం జరిగినది.