పీఎం కిసాన్ ఈ కేవైసీ పూర్తి చేసుకోవాలి
- మండల వ్యవసాయ అధికారి మహేందర్ రెడ్డి

బాల్కొండ నియోజకవర్గం , ఫిబ్రవరి 15 ( లోకంతీరు ) : నిజామాబాదు జిల్లా బాల్కొండ మండలంలోని బోదేపల్లి గ్రామంలో పీఎం కిసాన్ ఈ కేవైసీ మరియు ఆధార్ సీడింగ్ పై అవగాహన సమావేశం నిర్వహించినట్లు మండల వ్యవసాయ అధికారి మహేందర్ రెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ
1. పీఎం కిసాన్ ద్వారా నగదు పొందుతున్న రైతులు ఈ కేవైసీ అనగా ఆధార్ నంబర్ మరియు మొబైల్ నెంబర్ను లింక్ చేసుకోవాలి. లింకు చేసుకోవడానికి రైతు తన మొబైల్ లో లేదా ఏఈఓ దగ్గర లేదా దగ్గరలోని సి. ఎస్. సి డిజిటల్ సేవలో పూర్తిచేసుకోనవచ్చు.
2. అలాగే ఆధార్ సీడింగ్ అనగా బ్యాంకు ఖాతా మరియు ఆధార్ నంబర్ను లింకు చేసుకోవాలి ఇందుకు గాను సంబంధిత బ్యాంకు లేదా పోస్టల్ డిపార్ట్మెంట్ అధికారుల వద్ద సంబంధిత పత్రాలు తీసుకొని వెళ్లి లింకు చేసుకోవాలి.
3. బాల్కొండ మండలంలో ఇంకా 43 మంది ఈ కేవైసీ మరియు 58 మంది ఆధార్ సీడింగ్ చేసుకోవాల్సిన వారు ఉన్నారు. వీరు సంబంధిత పత్రాలతో ఈ కేవైసీ మరియు ఆధార్ సీడింగ్ పూర్తి చేసుకున్నట్లయితే వచ్చే విడత నుండి పీఎం కిసాన్ డబ్బులు ఖాతాలో జమ అవుతాయి.
ఈ కార్యక్రమంలో ఏఈఓ నిహారిక, బిపిఎం సత్యనారాయణ రైతులు పాల్గొన్నారు