Take a fresh look at your lifestyle.

జానకంపేట జిల్లా పరిష త్ ఉపాధ్యాయునికి పదవి విరమణ

0

జానకంపేట జిల్లా పరిష త్ ఉపాధ్యాయునికి పదవి విరమణ

ఎడపల్లి, అక్టోబర్ 31 ( లోకంతీరు ) : ప్రభుత్వ ఉద్యోగ విధుల్లో ఉన్న ప్రతి ఒక్కరికి ఉద్యోగ పదవీ విరమణ తప్పనిసరి అని జిల్లా విద్యాశాఖ అధికారి అశోక్ తో పాటు పి ఆర్ టి యు (టి ఎస్) జిల్లా అధ్యక్షులు మోహన్ రెడ్డి అన్నారు. ఎడపల్లి మండలం జానకంపేట జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఉపాధ్యాయునిగా విధులు నిర్వహించి శుక్రవారం ఉద్యోగ విరమణ పొందిన హనుమంత్ రెడ్డి నర్మద దంపతులను జిల్లా విద్యాశాఖ అధికారి అశోక్ తో పాటు, పి ఆర్ టి యు, టీఎస్ జిల్లా అధ్యక్షులు మోహన్ రెడ్డి ఘనంగా సన్మానించారు. విధి నిర్వహణలో హనుమంత్ రెడ్డి నిక్కచ్చిగా పనిచేసి జానకంపేట పాఠశాలలో చదువుతున్న విద్యార్థుల తల్లిదండ్రుల మన్నలతో పాటు, మండల జిల్లా స్థాయి సంబంధిత విద్యాశాఖ అధికారుల, సహా తోటి ఉపాధ్యాయుల ఆదర అభిమానాలను చురగొన్నారని కొనియాడారు. ఉద్యోగ విరమణ పొందిన హనుమంత్ రెడ్డి దంపతులు ఆయురారోగ్యాలతో ఉండాలని వారు ఆకాంక్షించారు. కార్యక్రమంలో స్థానిక పాప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు, మండలంలోని పి ఆర్టీ యు, (టీఎస్) సంఘ బాధ్యులు, ఉపాధ్యాయులు పాఠశాల విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.