ద్విచక్ర వాహనదారులు హెల్మెట్ ధరించాలి
ఎల్లారెడ్డి, జనవరి 07 ( లోకంతీరు ) : ఎల్లారెడ్డి మండల పరిధిలోని కామారెడ్డి ఎల్లారెడ్డి ప్రధానరహదారిపై పోసానిపల్లి వద్ద ఎస్ఐ మహేష్ ఆధ్వర్యంలో మంగళవారం పోలీసులు వాహనాల తనిఖీలు నిర్వహించారు. ద్విచక్ర వాహనాలను, కార్లను ఆపి తనిఖీలు చేపట్టారు. ద్విచక్రవాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని, కారులో ప్రయాణించే వారు సీట్ బెల్ట్ తప్పనిసరిగా ధరించాలని సూచించారు. వాహనదారులు సరైన ధ్రువీకరణ పత్రాలు ఉండేలా చూసుకోవాలని, ద్విచక్ర వాహనాలపై త్రిబుల్ రైడింగ్ చేయవద్దని, మైనర్లకు తల్లి తండ్రులు వాహనాలు ఇవ్వద్దని, పరిమితికి మించిన వేగంతో వెళ్లవద్దని సూచించారు. ఈ కార్యక్రమంలో ఏఎస్ఐ నరేందర్, పోలీస్ సిబ్బంది అనిల్ గౌడ్, అర్చన పాల్గొన్నారు.