అక్రమంగా మొరం తవ్వకాలు
చేస్తున్న జేసీబీ, ట్రాక్టర్ ను పట్టుకున్న అధికారులు

ఎల్లారెడ్డి, జనవరి 07 ( లోకంతీరు ) : అనుమతులు లేకుండా మొరం తవ్వి రవాణా చేస్తే కఠిన చర్యలు తప్పవని ఎల్లారెడ్డి తహసీల్దార్ అల్లం మహేందర్ హెచ్చరించారు. విశ్వాసనీయ సమాచారం మేరకు ఎల్లారెడ్డి మండల పరిధిలోని తవ్వకాలు మొరం తవ్వకాలు జరుపుతున్న జేసీబీ, ఒక ట్రాక్టర్ ను పట్టుకున్నట్లు తెలిపారు. వీటిని ఎల్లారెడ్డి పోలీస్ స్టేషన్ కు తరలించినట్లు తెలిపారు. అక్రమంగా మొరం తవ్వకాలు జరిపితే బాధ్యులపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.