రోడ్డు ప్రమాదంలో వ్యక్తి కిగాయాలు ప్రభుత్వ ఆసుపత్రికి తరలింపు

ఎడపల్లి , ఆగస్టు 29 ( లోకంతీరు ) : బోధన్- నిజామాబాద్ ప్రధాన రహదారి ఎడపల్లి మండల పరిధిలోని సాఠాపూర్ గేట్ సమీపానగల డివైడర్‌ను ఢీకొని ఓ వ్యక్తికి. తీవ్ర గాయాల పాలైనట్లు ఎడపల్లి పోలీసులు తెలిపారు.పోలీసులు తెలిపిన వివరాలు ఇలాఉన్నాయి. బోధన్ పట్టణంలోని రెంజల్ బేస్‌కు చెందిన ఎస్.కె ఆన్సర్ అనే వ్యక్తి తన మోటార్ సైకిల్ పై బోధన్ నుండి నిజామాబాద్ కు సొంత పనులకు వెళుతుండగా సాటపూర్ గేటు వద్ద గల డివైడర్‌ను బలంగా ఢీకొనడంతో వ్యక్తికితీవ్రగాయలైనట్లు పోలీసులు తెలిపారు. తీవ్రంగా గాయపడ్డ వ్యక్తిని చికిత్స నిమిత్తం నిజాంబాద్ ప్రభుత్వ ఆసుపత్రికి 108 అంబులెన్స్‌లో తరలించడం అయినదనిఎడపల్లి ఎస్సై ముత్యాల రమ తెలిపారు.