ఎడపల్లి మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో సీఎం రేవంత్ రెడ్డి జన్మదిన వేడుకలు
– ఎడపల్లి మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు పులి శ్రీనివాస్ రావు

ఎడపల్లి, నవంబర్ 08 ( లోకంతీరు ) : ఎడపల్లి మండల కేంద్రంలో శనివారం తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి జన్మదిన శుభ సందర్భంగా మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నాయకులు జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఎడపల్లి ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో రోగులకు, సాంఘిక సంక్షేమ బాలుర వసతి గృహంలో విద్యార్థులకు పండ్లు పంపిణీ చేశారు.అనంతరం మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు పులి శ్రీనివాసరావు మాట్లాడారు. ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన ఆరు గ్యారెంటీ పథకాల హామీలను తప్పకుండా రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తుందన్నారు. కాంగ్రెస్ అంటే రేవంత్ రెడ్డే, రేవంత్ రెడ్డి అంటే కాంగ్రెస్సే అన్నారు. బోధన్ శాసనసభ్యులు పి సుదర్శన్ రెడ్డికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తో పాటు అధిష్టానం ప్రభుత్వ ముఖ్య సలహాదారునిగా నియమించడం హర్షనీయమన్నారు. గత నాలుగు పంటల నుండి రైతన్నలు పండించిన వరి పంట ధాన్యానికి మద్దతు ధర ఇస్తూ సకాలంలో రైతుల ఖాతాల్లో డబ్బులు జమ చేయడం జరుగుతుందన్నారు.అలాగే రైతుల కష్టాలు తెలుసుకున్న రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రైతు ఖాతాల్లో క్వింటాలకు 500 రూపాయలు చొప్పున బోనస్ వేయడం ప్రభుత్వానికే ఈ ఘనత దక్కిందన్నారు. మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం, 200 యూనిట్ల లోపు విద్యుత్ వాడుతున్న.గృహ యజమానులకు ఉచిత కరెంటు, చౌక ధరల దుకాణాల ద్వారా సన్నబియ్యం, ఇలాంటి పథకాలను అమలు చేస్తూ ప్రజల ఆధార అభిమానులను ప్రభుత్వం పొందుతుందన్నారు.పి సుదర్శన్ రెడ్డికి ప్రభుత్వ సలహాదారునిగా నియమించి రాష్ట్ర క్యాబినెట్ హోదా కల్పించదం పట్ల నాయకులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తో పాటు టిపిసిసి అధ్యక్షులు బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ రాష్ట్ర మంత్రులకు, ఎంపీలకు, ఎమ్మెల్యేలకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. కార్యక్రమంలో మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు పులి.శ్రీనివాస్ రావు, ఎస్సీ సెల్ జిల్లా అధ్యక్షుడు ఈరంటి లింగం, జైతాపూర్ సహకార సంఘం అధ్యక్షులు కరటూరి సత్యనారాయణ, మండల కాంగ్రెస్ పార్టీ కోశాధికారి బొబ్బిలి శ్రీనివాస్, మాజీ సర్పంచులు శంకర్ నాయుడు, ఎల్లయ్య యాదవ్, మంగల్ పాడ్ గ్రామానికి చెందిన సీనియర్ కాంగ్రెస్ యువ నాయకులు సన్నిగౌడ్. రంజిత్ గౌడ్. ఐరండ్ల నవీన్, రత్నాకర రెడ్డి, బంజ కామప్ప, నాయకులు శివరాం ప్రసాద్, మైదం ప్రతాపరెడ్డి, మనోజ్ కుమార్, బషీర్, హాస్టల్ వార్డెన్ నర్సింలు, నాయకులు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.