Take a fresh look at your lifestyle.

హేమావతి నగర్ కాలనీ బీఆర్‌ఎస్ లీడర్ బాలు కాంగ్రెస్‌లో చేరిక……

0

హేమావతి నగర్ కాలనీ బీఆర్‌ఎస్ లీడర్ బాలు కాంగ్రెస్‌లో చేరిక

– రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ రేకులపల్లి భూపతిరెడ్డి ప్రోద్భలంతో

జూబ్లీహిల్స్,/నిజామాబాద్ రూరల్, నవంబర్ 08, లోకంతీరు ) : జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీలో చేరికలు వేగవంతమవుతున్నాయి. ఎర్రగడ్డ డివిజన్‌లోని హేమావతి నగర్ కాలనీకి చెందిన బీఆర్‌ఎస్ కాలనీ లీడర్ బాలు, రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ రేకులపల్లి భూపతిరెడ్డి ప్రోద్భలంతో కాంగ్రెస్ పార్టీలో చేరారు.శనివారం ఉదయం కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి నవీన్ యాదవ్ సమక్షంలో, నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ రేకులపల్లి భూపతిరెడ్డి ఆధ్వర్యంలో బాలు తన అనుచరులు వంద మందితో కలిసి కాంగ్రెస్ పార్టీ కండువా కప్పుకున్నారు.తరువాత బాలు, ఎమ్మెల్యే భూపతిరెడ్డి గారిని మర్యాదపూర్వకంగా కలసి శాలువా కప్పి సన్మానించారు. ఈ సందర్భంగా బాలు మాట్లాడుతూ, జూబ్లీహిల్స్ నుండి కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ గారిని భారీ మెజార్టీతో గెలిపించేందుకు కృషి చేస్తామని తెలిపారు.ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.