Take a fresh look at your lifestyle.

సుద్దులంలో ఉచిత పశువైద్య శిబిరం…

0

సుద్దులంలో ఉచిత పశువైద్య శిబిరం.

 

  • పశుగణాభివృద్ధి సంస్థలో గోపాల్ మిత్ర సెంటర్లలో ఉచిత పశు వైద్య శిబిరం.

బాన్సువాడ కోటగిరి, జనవరి 30 ( లోకం తీరు ) : నిజామాబాద్ జిల్లా కోటగిరి మండలంలోని సుద్దులం గ్రామంలో పశుగణాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో ఉచిత పశువైద్య శిబిరము నిర్వహించారు.ఈ ఉచిత పశు వైద్య శిబిరానికి ముఖ్య అతిథులుగా గ్రామ సర్పంచ్ గోపు సాయిలు,ఉప సర్పంచ్ తోట రాధిక శ్రీనివాస్ గ్రామ కార్యదర్శి కవితలు పాల్గొని గోమాతకు ప్రత్యేక పూజలు చేశారు.అనంతరం రిబ్బన్ కట్ చేసి ఉచిత పశువైద్య శిబిరాన్ని ప్రారంభించారు.తదనంతరం డాక్టర్ సురేష్ కుమార్ రైతుల తో మాట్లాడుతూ ప్రభుత్వం పశుపోషణ కోసం కిషన్ క్రెడిట్ కార్డు రుణాలు బ్యాంకు ద్వారా ఇప్పించడం జరుగుతుందన్నారు.పశువులున్న రైతులు ప్రతి ఒక్కరు ఈ రుణాలను సద్విని యోగం చేసుకోవాలని సూచిం చారు.అలాగే ఈ రుణాలు అవసరమైన వారు అందు బాటులో ఉన్న పశువైద్యాధికా రి పశు వైద్యశాలలో దరఖాస్తు చేసుకోవాలని తెలిపారు. అనంతరం సర్పంచ్ గోపు సాయిలు, ఉప సర్పంచ్ రాధిక శ్రీనివాస్ చేతుల మీదుగా ప్రభుత్వం పాడి రైతులకు అందజేస్తున్న ఉచిత మందులను పంపిణీ చేశారు.

ఈ శిబిరంలో మండల పశు వైద్యాధి కారులు డాక్టర్ సురేష్ కుమార్, రుద్రూర్ డాక్టర్ సంతోష్ కుమార్ 102 పశువు లకు పరిశీలించారు.అందులో 32 పశువులకు గర్భకోశ చికిత్సలు చేయగా,22 పశువులకు సాదారణ చికిత్సలు చేశారు.అలాగే 42 పశువులకు నట్టల నివారణ మందులు వేశారు.అలాగే జంతు సంరక్షణ పక్ష ఉత్సవాల సందర్భంగా పెంపుడు కుక్క లకు యాంటీ ర్యాబిస్ టీకాలను సైతం ఉచితంగా ఇవ్వడం జరిగింది.ఈ సందర్భంగా డాక్టర్ సురేష్ కుమార్ మీడియాతో మాట్లాడుతూ.ప్రతి ఇంట్లో పాడి ఉంటే లక్ష్మీ ఉన్నట్లే అందుకే ప్రతి ఒక్కరు పాడి పశువులను పెంచు కొని దూడల సంరక్షణ చేయాలన్నారు.పాడి పశు వులు ఉన్న రైతులకు కిషన్ క్రెడిట్ కార్డు ద్వారా పశు పోషణ కోసం ప్రతి పశువుకు రూ.22 వేల రుణాలు బ్యాంక్ ద్వారా తీసుకోవచ్చన్నారు. ఇలాంటి మంచి అవకాశాలను పశువులున్న రైతులు సద్విని యోగం చేసుకోవాలని ఆయన పేర్కొన్నారు.

పశువైద్య శిబిరం లో పశువులకు ఉచితంగా చికిత్సలు చేయడం జరిగిందని అన్నారు.ఏద కొచ్చిన పశువుల కు అందుబాటులో ఉన్న పశువైద్యశాలలో లేదా గోపాలమిత్ర ద్వారా కృత్రిమ గర్వధారణ చేయించుకోవాలని ఆయన రైతులకు సూచించారు అలాగే గోపాలమిత్ర సూప ర్వైజర్ తిరుపతి మాట్లాడుతూ పశుగణాభివృద్ధి సంస్థలో గోపాల్ మిత్ర సెంటర్లలో ఉచిత పశు వైద్య శిబిరం నిర్వహించడం జరుగుతుందని అన్నారు. ఈ ఉచిత వైద్య శిబిరంలో 102 పశువులకు పశు వైద్యాధికారులు పరీక్షలు జరిపారు.ఈ ఉచిత పశు వైద్య శిబిరాన్నీ నిర్వహించిన పశువైద్యాధి కారులకు గ్రామస్తులు కృతజ్ఞతలు తెలిపారు.ఈ సంద ర్భంగా శిబిరానికి సహకరించిన గ్రామస్తులకు పశు వైద్యాధికారులకు కృత జ్ఞతలు తెలిపారు.ఈ ఉచిత పశువైద్య శిబిరంలో రుద్రూర్ పశు వైద్యులు డాక్టర్ సంతోష్ కుమార్,ట్రైనీ డాక్టర్లు అభిషేక్, రాజేందర్,గోపాలమిత్ర సూప ర్వైజర్ తిరుపతి,వెటర్నరీ లైవ్ స్టాక్ అధికారి మంజుల, వెటర్నరీ అసిస్టెంట్ సుధీర్ గౌడ్,కొత్తపల్లి గోపాల మిత్ర రాము,కోడిచెర్ల గోపాల మిత్ర నగేష్,హంగర్గ ఫారం గోపాల మిత్ర రియాజ్,గ్రామస్థులు ఈశ్వర్,తోట సాయి కుమార్, శంకర్,సురేష్ పటేల్,శ్రావణ్, నరేందర్,గోవింద్,మానిక్ రావు పటేల్,పరబయ్య,బంగారి గోపు సాయిలు,ప్రకాష్ పటేల్ తదిత రులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.