వాహనాలకు నెంబర్ ప్లేట్ లేదా…
అలా నడిపితే కఠిన చర్యలు తప్పవు.
–ముప్కాల్ ఎస్సై భాస్కరా చారి

ముప్కాల్ , ఫిబ్రవరి 03 (లోకం తీరు) : ముప్కాల్ మండల కేంద్రంలో పొలీస్ వారు వాహనాల తనిఖీ చేస్తూ ఉండగా నంబర్ ప్లేట్ లేని రెండు బైక్ లను సీజ్ చేసి పొలీస్ స్టేషను కు తరలించి ఫైన్ వేయడం జరిగినది. నంబర్ ప్లేట్ పెట్టుకున్న తర్వాత కౌన్సిలింగ్ ఇచ్చి బైక్ లను రిలీజ్ చేయడం జరిగిందని ఎస్ఐ భాస్కరా చారి తెలిపారు. నంబర్ ప్లేట్ లేకుండా మరియు తప్పుడు నంబర్ పెట్టి దొంగతనాలకు నేరస్థులు నేరం చేస్తున్నందున ప్రతి ఒక్కరూ తమ బైక్ లకు కచ్చితంగా నంబర్ ప్లేట్ ఉంచవలెను అని తెలిపారు . ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని హెల్మెట్ ధారణ కచ్చితం అని మరియు ట్రిపుల్ రైడింగ్, రాంగ్ రూట్ జర్నీ ప్రాణానికి ముంపు అని తెలియ చేసారు.