పిల్లర్ దశలోనే ఆగిన ఆసుపత్రి నిర్మాణ పనులు
ముధోల్,జనవరి 23 ( లోకంతీరు ) : పేరుకే నియోజకవర్గ కేంద్రమైన ముధోల్ లో అభివృద్ధికి నిరంతరం కట్టుబడి ఉంటామని మాటలు చెప్పే పాలకులు అభివృద్ధిని విస్మరిస్తున్నారన్న విమర్శలు సర్వత్రా వ్యక్థమవుతున్నాయి.ఇదే కోవకు చెందిన ముధోల్ ఆసుపత్రి నిర్మాణ పనులు సంవత్సరన్నర దాటిన పిల్లర్ దశలోనే ఆగిపోయిన పట్టించుకొనే నాథుడు కరువ్యాడని మండల ప్రజలు వాపోతున్నారు.గత బీర్ఎస్ ప్రభుత్వం నియోజకవర్గంలొ 30 పడకల నూతన ఆసుపత్రి భవన నిర్మాణం కోసం ముధోల్లోని జాతీయ రహదారి పక్కన ఆసుపత్రి నిర్మాణ పనులను గతంలో ప్రారంభించారు.ఈపనులు దక్కించుకున్న కాంట్రాక్టర్ మొదట్లో చురుకుగా పని చేసి పిల్లర్ దశకు రావడంతో పనులను నిలిపివేశారు.గత ప్రభుత్వం నిర్మాణ బిల్లులు చెల్లించకపోవడంతో సదరు కాంట్రాక్టర్ ఆదిలోనే వదిలి పెట్టాడు .అయితే సంవత్సరంన్నర దాటిన నియోజకవర్గం పాలకులు పట్టించుకోకపోవడంపై ప్రజలు మండిపడుతున్నారు.దీంతో పాత ఆసుపత్రిలో నామ మాత్రం వైద్య సేవలు అందుతున్నాయి.వైద్యులు ఉన్నప్పటికీ ఆసుపత్రిలో ఎటువంటి సదుపాయాలు లేకపోవడంతో ఆపరేషన్లు జరగడంలేదు.పలుమార్లు ముధోల్ నాయకులు యువజన సంఘం సభ్యులు గ్రామస్తులు,ఆసుపత్రిని అభివృద్ధి చేయాలని ఆందోళన చేసినప్పటికి పాలకులు మాత్రం స్పందించడం లేదన్నా వాదనలు బహిరంగంగా వినిపిస్తున్నాయి.గత ఎమ్మెల్యే ఆసుపత్రి నిర్మాణనికి ప్రయత్నం చేసినప్పటికి అంతలోనే ఎన్నికలు రావడంతో కాంట్రాక్టర్ కు బిల్లులు రాక ఆసుపత్రి నిర్మాణ పనులు నిలిచిపోయాయి.ఈ కాంగ్రెస్ ప్రభుత్వం అయిన అధికారంలోకి వచ్చిన తరువాత నిర్మాణ పనులు వేగంగా జరుగుతాయని ఆశ పడ్డా స్థానికులకు మాత్రం నిరాశ ఎదురువుతుంది.ఆసుపత్రి పనులు త్వరగా చేపట్టాలని స్థానికులు బీజేపీ పార్టీ నాయకులు పత్రిక పరంగా కోరినప్పటికీ పాలకుల స్పందన మాత్రం కరువైందని పలువురు అంటున్నారు.ప్రతి ఎన్నికల్లో ముధోల్ అభివృద్ధికి కట్ట్టుబడి ఉంటాం అంటూ పలుసమావేశల్లో కూడా పాలకులు,ముధోల్ అభివృద్ధికి నిరంతరం కృషి చేస్తామని ప్రసంగిస్తున్న పనులు ఎందుకు ముందుకు సాగడం లేదని పలువురు ప్రశ్నిస్తున్నారు.ప్రభుత్వం పై పాలకులఒత్తిడి సరైన రీతిలో లేకపోవడంవల్లే ఆసుపత్రి పనులు ఆగిపోయాయని పలువురు ఆరోపిస్తున్నారు.రాష్ట్రం లో కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పటికీ మాజీ ఎమ్మెల్యే విఠల్ రెడ్డి,నారాయణ రావు పటేల్ లు కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు.అయితే ప్రభుత్వంపై మాజీ ఎమ్మెల్యేలు,కాంగ్రెస్ నాయకులు,ఓత్తిడి సక్రమంగా లేకపోవడం వల్లే ఆసుపత్రి నిర్మాణ పనులు జరగడంలేదని పలువురు ఆరోపిస్తున్నారు.అలాగే మూధోల్ నియోజకవర్గ లో బీజేపీ ఎమ్మెల్యే పవార్ రామారావు పటేల్ ఉన్నారు.ఆసుపత్రి నిర్మాణపనులను వెంటనే చేపట్టేవిధంగా చూడాలని నాయకులు ఎమ్మెల్యే దృష్టికి కూడా తెచ్చారు.అయిన నిర్మాణపనులు ఎక్కడ వేసిన గొంగళి అక్కడే ఉంది.మూధోల్ మండల ప్రజలు వైద్యం కోసం బైంసా,నిజామాబాద్, మహారాష్ట్ర లోని నాందేడ్, వంటి దూర ప్రాంతాలకు మెరుగైన వైద్యం కోసం వెళ్ళల్సిన పరిస్థితి వచ్చిందిని పేద ప్రజలు వాపోతున్నారు.దింతో ఆర్థికంగా నష్టపోతున్నామని ప్రజలు అంటున్నారు.ప్రజలు ఓటు వేసి గెలిపించిన గద్దెనెక్కిన తర్వాత నాయకులు సమస్యలు గాలికి వదిలేస్తున్నారని ప్రజలు మండిపడుతున్నారు.ఇప్పటికైనా పాలకులు,కాంగ్రెస్ ప్రభుత్వం స్పందించి ఆసుపత్రి నిర్మాణ పనులు త్వరగా పూర్తి చేసి మండల ప్రహలకు మెరుగైన వైద్య సేవలు అందేవిధంగా చర్యలు తీసుకోవాలని మండల ప్రజలు కోరుతున్నారు.