Take a fresh look at your lifestyle.

ఉచిత దంత మరియు కంటి వైద్య శిబిరం…

0

ఉచిత దంత మరియు కంటి వైద్య శిబిరం.

బాన్సువాడ/కోటగిరి, ఫిబ్రవరి 05 ( లోకం తీరు న్యూస్ ):- బోధన్ లైఫ్ కేర్ డెంటల్ ఆస్పత్రి,లైన్స్ కంటి ఆస్పత్రి వైద్యుల సౌజన్యంతో కోటగిరి లైన్స్ క్లబ్ ఆఫ్ డైమండ్ ఆధ్వర్యంలో సోమవారం కోటగిరి మండల కేంద్రంలోని శ్రీ వేద హైస్కూల్లో ఉచిత దంత, కంటి వైద్య శిబిరాన్ని నిర్వహించారు.ఈ శిబిరంలో వైద్యులు విద్యార్థులకు వైద్య పరీక్షలు నిర్వహించారు. ప్రముఖ దంత వైద్యులు ఇర్ఫాన్ అలీ విద్యార్థులకు దంత పరీక్షలు నిర్వహించి ఉచితంగా టూత్ పేస్టులు, బ్రేష్లను పంపిణీ చేశారు.అలాగే దంత సంరక్షణపై ఆయన విద్యార్థులకు అవగాహన కల్పిస్తూ విద్యార్థులు దంతాలను శుభ్రంగా ఉంచుకోవాలని ,September ఉదయం,రాత్రి వేళలో తప్పనిసరిగా బ్రేష్ వేసుకో వాలని సూచించారు.నోటి సంబంధమైన వ్యాధులకు ప్రధాన కారణం దంత సంబంధమైన వ్యాధులే అని ఆయన అన్నారు.లైన్స్ కంటి ఆసుపత్రి కంటి వైద్య సహాయకులు సతీష్ విద్యార్థులకు కంటి పరీక్షలు నిర్వహించి,ఉచితంగా ఐ డ్రాప్స్ పంపిణీ చేశారు.కంటి వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండాలని,అన్ని అవయవాల్లో కెల్ల కళ్ళు ప్రధానమైనవని ఆయన అన్నారు. అనంతరం పాఠశాల యాజమాన్యం వైద్యులు ఇర్ఫాన్ అలీ, డా.సతీష్ లను శాలువాతో సత్కరించారు.ఈ కార్యక్రమం లో పాఠశాల డైరెక్టర్ తెల్ల రవి కుమార్,ప్రిన్సిపల్ అక్షర,లైన్స్ క్లబ్ ఆఫ్ డైమండ్ అధ్యక్షులు హనుమంత రావు,కప్ప సంతోష్, లక్ష్మిరాజు, యోగేష్ ఉమాకాంత్,అర్పిత్,పాఠశాల సిబ్బంది నిర్మల,రేష్మ,చంద్రకళ, సంగీత, సాయినాథ్, రమేష్, నాగరాజు,భీమ్రావు,గౌతమి, శ్రావణి,కావ్య,అను,తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.