జానకంపేటలో ఉప్పు గంగలత సర్పంచ్ గా నామినేషన్

ఎడపల్లి, నవంబర్ 28 ( లోకంతీరు ) : ఎడపల్లిమండలం జానకంపేట గ్రామపంచాయతీలో శుక్రవారం స్థానిక సంస్థల ఎన్నికల్లో భాగంగా పోలింగ్ కేంద్రంలో జానకంపేట గ్రామానికి చెందిన ఉప్పు గంగలత సర్పంచ్ గా నామినేషన్ దాఖలు చేశారు. బిసి జనరల్ రావడంతో నామినేషన్ దాఖలు చేసినట్లు తెలిపారు. అనంతరం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆమె మాట్లాడారు జానకంపేట గ్రామ పంచాయతీకి సర్పంచ్‌గా తొలిసారిగా పోటీ చేస్తున్నందుకు గ్రామ పెద్దలు మహిళలు యువకులు మీ అమూల్యమైన ఓట్లు వేసి తమను గెలిపించాలని ఆమె పేరుపేరునా విజ్ఞప్తి చేశారు. గ్రామాలు అభివృద్ధి చెందాలంటే మంచి వ్యక్తులను ఎన్నుకోనాలని ఆమె విజ్ఞప్తి చేశారు. గ్రామస్తులు సహకారం ఉన్నప్పుడే గ్రామ పంచాయతీల తో పాటు గ్రామాలు అభివృద్ధి చెందుతాయని ఆమె ఆశ భావం వ్యక్తం చేశారు. నామినేషన్ కేంద్రాల వద్ద ఎడపల్లి పోలీసులు బందోబస్తు నిర్వహించారు తొలిసారి తాను సర్పంచ్ గా పోటీ చేస్తున్నందున గ్రామ పెద్దలు యువకులు, మహిళలు మీ పెద్ద మనసుతో నన్ను ఆశీర్వదించాలని ఆమె కోరారు.ఆడ బిడ్డను ఆదరించండి.
జానకంపేట సర్పంచ్ అభ్యర్థి ఉప్పు గంగలత
జానకంపేట లో సర్పంచ్ ఎన్నికల్లో తాను పోటీ చేస్తున్నందున గ్రామస్తులు పెద్ద మనసుతో నన్ను ఆశీర్వదించి ఆడబిడ్డగా గెలిపించాలని సర్పంచ్ అభ్యర్థి ఉప్పు గంగాలత గ్రామస్థులను కోరారు. గ్రామాభివృద్ధికి తన వంతు కృషి చేస్తానని ఆమె అన్నారు.