లోకం తీరు వార్త కథనానికి స్పందన.
ట్రాన్స్ కో అధికారులకు కృతజ్ఞతలు తెలిపిన కాలని వాసులు.

బాన్సువాడ/కోటగిరి, జూలై 07 ( లోకంతీరు) : కరెంటు తీగలకు చెట్టేత్తు ప్రమాదమనే లోకం తీరు పత్రికలో ఆదివారం వచ్చిన కథనానికి కోటగిరి మండల ట్రాన్స్ కో అధికారులు,సిబ్బంది తక్షణమే స్పందించారు.ఈ మేరకు కరెంట్ తీగలపైకి ఏపుగా పెరిగిన చెట్టు కొమ్మలను ట్రాన్స్ కో సిబ్బంది తొలగించారు.ఈ సందర్భంగా వినాయక్ నగర్ కాలనీవాసులు కోటగిరి ట్రాన్స్ కో అధికారులు, సిబ్బందికి కృతజ్ఞతలు తెలియజేశారు.