ప్రజల ఆశీర్వాదంతో గెలిస్తే సమస్యల పరిష్కారానికి కృషి
-
ఎడపల్లి మాజీ సర్పంచ్ శంకర్ నాయుడు

ఎడపల్లి , నవంబర్ 28 ( లోకంతీరు ) : ఎడపల్లి మండల పరిధిలో పంచాయతీ ఎన్నికల నామినేషన్ ప్రక్రియ నామినేషన్ రెండవ రోజు ఉత్సాహంగా ప్రారంభమైంది శుక్రవారం ఎడపల్లి గ్రామానికి చెందిన శంకర్ నాయుడు సర్పంచ్ అభ్యర్థిగా తన నామినేషన్ ను పంచాయతీ కార్యాలయంలో దాఖలు చేశారు అనంతరం ఆయన మాట్లాడుతూ గ్రామ అభివృద్ధి తన లక్ష్యమని ప్రజలు ఇచ్చే విశ్వాసం మద్దతుతో ప్రజల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని తెలిపారు గ్రామ ప్రజలతో కలిసి గ్రామ అభివృద్ధి పథంలో ముందుకు సాగేందుకు అవకాశం ఇవ్వాలని కోరారు.