Take a fresh look at your lifestyle.

ఆకతాయిల ఆటలు కట్టించండి…

0

ఆకతాయిల ఆటలు కట్టించండి

రామారెడ్డి ,సెప్టెంబర్ 25 ( లోకంతీరు ) : రామారెడ్డి మండల కేంద్రంలోని జడ్.పి.హెచ్.ఎస్ ఉన్నత పాఠశాల యొక్క గ్రౌండ్ ఆవరణ ప్రాంతంలో రాత్రివేళ ఆకతాయిలకు అడ్డు అదుపు లేకుండా, విచ్చలవిడిగా మద్యం సేవిస్తున్నారని, అర్ధరాత్రి వరకు పాఠశాల ఆవరణలో విచ్చలవిడిగా జూదం, మద్యపానం సేవించి సీసాలను పగలగొట్టడం వలన పాఠశాల విద్యార్థులకు ఇబ్బందిగా మారుతుందని అదేవిధంగా సివిల్ పంచాయతీలు జరుపుతున్నారని ఇలాంటి సంఘటనలు జరగకుండా తగిన చర్యలు తీసుకోవాలని స్థానిక పోలీస్ స్టేషన్ లో ఆజాద్ హిందూ యువజన సంఘం ఆధ్వర్యంలో వినతి పత్రం అందజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఆజాద్ యువజన సంఘం సభ్యులు గుజగుంట స్వామి, కురుమ ప్రవీణ్, సుధాకర్ గౌడ్, బాల్ దేవ్ చిన్న అంజయ్య, నోముల సందీప్, బోల్గం శ్రీనివాస్, పటిగల శ్రీనివాస్, వడ్ల నవీన్, సౌడం నవీన్ తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.