దేశ భాష లందు తెలుగు లెస్స
ఘనంగా తెలుగు భాషా దినోత్సవం

నిజామాబాద్ అర్బన్ , ఆగస్టు 29 ( లోకంతీరు ) : దేశ భాషలందు తెలుగు భాష లెస్స అని శ్రీ కృష్ణ దేవరాయలచే కొనియాడిన మహోన్నతుడు గిడుగు రామ్మూరి అని శబ్ద తరంగిణి సంస్థ వ్యవ్యస్థాపక అధ్యక్షుడు సేర్ల దయానంద్ పేర్కొన్నారు.నగరంలోని సరస్వతి నగర్ లో వున్న సంస్థ కార్యాలయంలో శుక్రవారం గిడుగు రామ్మూర్తి జయంతి రోజునే తెలుగు భాష దినోత్సవం నిర్వహించారు. ఈ సందర్బంగా రామ్మూర్తి జయంతి రోజునే చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు.అనంతరం సేర్ల దయానంద్ మాట్లాడుతూ,వ్యవహారిక భాషా పితామహుడు గిడుగు రామ్మూర్తి అని కొనియాడారు. తెలుగు భాష ప్రపంచంలో అత్యాధికంగా మాట్లాడుతున్న 16 వ అతి పెద్ద భాషా అని ఆయన అన్నారు.ఈ కార్యక్రమం లో రచయిత పి లక్ష్మణ్,బ్యాంకు మేనేజర్ గాండ్ల సంతోష్, సామల హరీష్ గౌడ్, ఆనంపల్లి రాజబాపు తదితరులు పాల్గొన్నారు.