మృతుని కుటుంబానికి కాంగ్రెస్ రాష్ట్ర నాయకులు సమత ఫౌండేషన్ చైర్మన్ సమత సుదర్శన్ భరోసా

ముధోల్, జనవరి 18 ( లోకంతీరు ) : నర్సాపూర్ (జి)మండలంలోని అంజని తండా గ్రామానికి చెందిన జాదవ్ శ్రీనివాస్ గత 11 రోజులు క్రితం మరణించడం జరిగింది.ఈ విషయం తెలుసుకున్న కాంగ్రెస్ రాష్ట్ర నాయకులు సమత ఫౌండేషన్ చైర్మన్ సమత సుదర్శన్ మృతుని కుటుంబాన్ని పరామర్శించి 50 కిలోల బియ్యాన్ని అందజేశారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతు భవిష్యత్తులో మృతుని కుటుంబానికి సమత ఫౌండేషన్ అండగా నిలుస్తుందని పేర్కొన్నారు. ఈ పరామర్శలొ వారి వెంట ఫౌండేషన్ సీఈవో అనిల్ కుమార్,ఆర్గనైజర్ సాహెబ్ రావు,నాయకులు నరేష్, ముత్యం తదితరులు పాల్గొన్నారు.