Take a fresh look at your lifestyle.

రైతు సేవలో కృషి విజ్ఞాన కేంద్రాలు….

0

రైతు సేవలో కృషి విజ్ఞాన కేంద్రాలు

ఎడపల్లి, ఫిబ్రవరి 12 ( లోకంతీరు) :  ఎడపల్లి మండలంలోని జైతాపూర్ గ్రామంలో మంగళవారం నిర్వహించిన ప్రకృతి వ్యవసాయంపై అవగాహన కార్యక్రమంలో గ్రామ రైతులకు రుద్రూర్ కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రజ్ఞులు పలు అంశాలపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు వ్యవసాయ రంగంలో ప్రస్తుతం విచ్చలవిడిగా వాడుతున్న పలు రకాల క్రిమిసంహారాలు రసాయన ఎరువుల మూలంగా నేల స్వభావం దెబ్బ తింటుందని తద్వారానున్న రోజుల్లో రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవలసిన పరిస్థితులు ఉంటాయని వారు సూచించారు మన పూర్వీకులు పాటించిన ప్రకృతి వ్యవసాయంపై రైతులు అవగాహన పెంచుకొని ప్రకృతికి మేలు చేసే ఎరువులను వాడడం మూలంగా నేల స్వభావం వ్యవసాయానికి అణువుగా మారుతూ నాణ్యమైన వ్యవసాయ ఉత్పత్తులను పండించే అవకాశం కలుగుతుందని అన్నారు అధిక దిగుబడిలను సాధించేందుకుగాను రైతులు వాడుతున్న వివిధ రకాల రసాయన ఎరువులతో విషతుల్యమైన ఆహార ఉత్పత్తులను పండిస్తున్నారని తద్వారా అవి పలు రకాల అనారోగ్యాలకు కారణమవుతున్నాయి ప్రకృతి వ్యవసాయంతో అటు పర్యావరణ లతో పాటు ఇటు మానవాళికి సైతం మేలు జరుగుతుందని వారు పేర్కొన్నారు అంతకుముందుగా క్షేత్ర ఉత్తమ కరటూరి పాపారావును రుద్రూర్ కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్తలు పాపారావును అభినందించారు ఈ కార్యక్రమంలో ప్రోగ్రాం కోఆర్డినేటర్ అంజయ్య క్రాప్ ప్రొడక్షన్ స్పెషలిస్ట్ స్వరూప హార్ట్లీ కల్చర్ స్పెషలిస్ట్ వెంకట రాజ్ కుమార్ తో పాటు రైతులు కరటూరి పాపారావు జనార్దన్ రెడ్డి వివేకానంద రెడ్డి శ్రీనివాస్ రెడ్డి చెరుకు ఉత్పత్తి దారుల మాజీ అధ్యక్షులు పాండురంగారావు జైతాపూర్ సుబ్బారావు వెంకటేశ్వరరావు నిర్మల్ రాంగోపాల్ రెడ్డి ప్రవీణ్ రెడ్డి తదితరులు రైతులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు

Leave A Reply

Your email address will not be published.