జానకంపేట్ సహకర సంఘంలో రుణమాఫీ చెక్కుల పంపిణీ
![]()
ఎడపల్లి, ఫిబ్రవరి 12( లోకంతీరు ) : ఎడపల్లి మండలంలోని జానకంపేట్ సహకార సంఘంలోగతంలో పంట రుణాలు తీసుకున్న రైతులకు రుణమాఫీ వచ్చిందని చైర్మన్ మిద్దె నరేందర్ తెలిపారు.బుధవారం సహకార సంఘం నుండి తిరిగి 19 మంది రైతులకు 6,88,500 రూపాయలుఅలాగే 6 మంది కొత్త రైతులకు 4,64,500 రూపాయల కొత్త రుణాల చెక్కులను సొసైటీ చైర్మన్ మిద్దె నరేందర్ చేతులమీదుగా రైతులకు పంపిణీ చేశారు ఇటి రుణాలను రైతులు వ్యవసాయ పంటలను మరింత అభివృద్ధి చేసుకొనుటకు ఉపయోగించుకోవాలని మంచి లాభాలను పొందాలని ఈ సందర్భంగా చైర్మన్ రైతులను కోరారుఅదేవిధంగా తీసుకున్న పంట రుణాలకు రైతులు ప్రతి సంవత్సరం సమయానికి వడ్డీ చెల్లించి సొసైటీ అభివృద్ధికి తోడ్పడాలని కోరారుఈ రుణాలను మంజూరు చేసినటువంటి ఉమ్మడి నిజామాబాద్ సహకార సంఘం చైర్మన్ కుంట రమేష్ రెడ్డి సీఈఓ నవీపేట బ్యాంక్ మేనేజర్ గారికిసిబ్బందికి ఆయన ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు .కార్యక్రమంలో సొసైటీ చైర్మన్ తో పాటు డైరెక్టర్లు సీఈఓగంగారెడ్డి సొసైటీ సిబ్బందిరైతులు పాల్గొన్నారు.
