క్రీడామైదాన నిర్మాణం కొరకు వినతి

నిజామాబాద్ అర్బన్, జులై 29 ( లోకంతీరు ) : నిజామాబాద్ జిల్లా క్రీడాకారుల కోసం క్రీడామైదనాం నిర్మించాలని ప్రభుత్వ సలహాదారులు షబ్బీర్ అలీ నీ జిల్లా ఒలంపిక్ అసోసియేషన్ కార్యదర్శి బొబ్బిలి నర్సయ్య విన్నవించారు.వినతి పై ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ త్వరలోనే ముఖ్యమంత్రి చేతుల మీదుగా మైదాన నిర్మాణ పనులు చేపడుతామని హామీనిచ్చారు.జిల్లా పర్యటనలో ఉన్న ప్రభుత్వ సలహాదారులు షబ్బీర్ అలీ నీ రోడ్లు భావనల అతిధి గృహం లో జిల్లా యువజన ,క్రీడా అధికారి పవన్,జిల్లా ఒలంపిక్ అసోసియేషన్ కార్యదర్శి బొబ్బిలి నర్సయ్య కలిసి గజామలతో షబ్బీర్ అలీ నీ సన్మానించారు.జిల్లాలో అంతర్జాతీయ స్థాయి క్రీడాకారులు ఉన్న వారికి కావలసిన కనీస మైదానం లేదని బొబ్బిలి నర్సయ్య ఆయన దృష్టికి తీసుకెళ్లారు.క్రీడాకారులకు ఎలాంటి ఆటంకం లేకుండా అన్ని వసతులతో కూడిన క్రీడామైదన ఏర్పాట్లను పూర్తి చేస్తామని షబ్బీర్ అలీ హామీ ఇచ్చారు. టిపిసిసి అధ్యక్షులు మహేష్ గౌడ్. బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి .క్రీడా శాఖ మంత్రితో సమీక్ష జరిపి త్వరలో నిజమాబాద్ లో జరిగే సీఎం పర్యటనలో క్రీడమైదనం పనులను ప్రారంభిస్తామని చెప్పారు.