Take a fresh look at your lifestyle.

ఆదివాసులను రాజకీయంగా చైతన్యం చేయడమే కాంగ్రెస్ పార్టీ లక్ష్యం ….

0

ఆదివాసులను రాజకీయంగా చైతన్యం చేయడమే కాంగ్రెస్ పార్టీ లక్ష్యం 

— తెలంగాణ ఆదివాసి కాంగ్రెస్ బినియది కార్యకర్తల సమ్మేళన్

–  కార్యక్రమంలో పాల్గొన్న డాక్టర్ రేకులపల్లి భూపతిరెడ్డి

నిజామాబాద్, జూలై 29 ( లోకంతీరు ) : ఆదివాసులను రాజకీయంగా చైతన్యం చేయడమే కాంగ్రెస్ పార్టీ లక్ష్యమని నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ రేకులపల్లి భూపతి రెడ్డి అన్నారు. నిజామాబాద్ నగరంలోని హరిత హోటల్లో ఏర్పాటుచేసిన తెలంగాణ ఆదివాసి కాంగ్రెస్ బినియది కార్యకర్తల సమ్మేళన్  కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా రూరల్ ఎమ్మెల్యే భూపతి రెడ్డి మాట్లాడుతూ జల్ జంగిల్ అనే నినాదం కాంగ్రెస్ ప్రభుత్వమే ఇచ్చిందని అని అన్నారు. రాహుల్ గాంధీ ట్రైబల్ ఏరియా లో ఎక్కువ పర్యటించి వారి యొక్క బాధలను అర్థం చేసుకొని ఆదివాసులు రాజకీయంగా ఎదగాలని ఉద్దేశంతో ఇటువంటి కార్యక్రమాలు నిర్వహిస్తున్నారని అన్నారు. 120 సంవత్సరాల పేరున్న పార్టీ కాంగ్రెస్ పార్టీని, బడుగు బలహీన వర్గాల కోసం ఇందిరా గాంధీ,రాజీవ్ గాంధీ పాటుపడ్డారని గుర్తు చేశారు. అలాగే మహాత్మా గాంధీ గిరిజన వాడల్లో తిరుగుతూ వాళ్ల వద్దనే ఉన్నారని అన్నారు. ఈ శిక్షణ తరగతుల్లో ఆధితులు చెప్పే ఉపన్యాసాలను సద్వినియోగం చేసుకోవాలని అన్నారు. నిజామాబాద్ రూరల్ లో ఎస్టీలు ఎక్కువగా ఉన్నారని, నేను గెలవడానికి ఎస్టీలు ఎంత కృషి చేశారని అన్నారు.రూరల్ నియోజవర్గంలో గిరిజన భవన్ నిర్మించడానికి స్థల సేకరణ చేశామని, త్వరలో భవనాలు నిర్మిస్తామని అన్నారు. ప్రతి తాండకు గ్రామపంచాయతీలు, ఇందిరమ్మ ఇల్లు, అంగన్వాడి కేంద్రాలు, సిసి రోడ్ల నిర్మాణం చేయిస్తున్నానని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రతి తండాలో అభివృద్ధి పనులు జరుగుతున్నాయని అన్నారు. ఈ కార్యక్రమంలో బోధన్ శాసనసభ్యులు సుదర్శన్ రెడ్డి, ఎఎంసీ చైర్మన్ ముప్పా గంగారెడ్డి, ఎన్ డి సి సి వైస్ చైర్మన్ నల్ల చంద్రశేఖర్ రెడ్డి, పిసిసి డెలికేట్ శేఖర్ గౌడ్,గిరిజన నాయకులు యాదగిరి, ఆదివాసి కాంగ్రెస్ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.