Take a fresh look at your lifestyle.

వి హెచ్ పి ఎస్ ఎమ్మార్పీఎస్ ఆధ్వర్యంలో ధర్నా…..

0

ఎడపల్లి గ్రామపంచాయతీ ముందు వి హెచ్ పి ఎస్ ఎమ్మార్పీఎస్ ఆధ్వర్యంలో ధర్నా

ఎడపల్లి, సెప్టెంబర్ 20 ( లోకంతీరు ) : రాష్ట్ర ప్రభుత్వం అధికారంలోకి రాకనమందు ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలుపరచాలని డిమాండ్ చేస్తూ విహెచ్పిఎస్, ఎమ్మార్పీఎస్ సంయుక్త ఆధ్వర్యంలో శనివారం ఎడపల్లి గ్రామపంచాయతీ ఎదుట ధర్నా చేసి పంచాయతీ కార్యదర్శికి వినతి పత్రాన్ని సమర్పించారు. ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపకులు, పద్మశ్రీ అవార్డు గ్రహీత మందకృష్ణ మాదిగ ఆదేశాల మేరకు ఈ కార్యక్రమాన్ని చేపట్టినట్లు విహెచ్పిఎస్ జాతీయ అధ్యక్షురాలు సుజాత సూర్యవంశం తెలిపారు. కార్యక్రమంలో వికలాంగుల హక్కుల పోరాటసమితి జాతీయ అధ్యక్షురాలు సుజాత సూర్యవంశీ మాట్లాడుతూ…వికలాంగులకు 6000 రూపాయలు.వృద్ధులు, వితంతువులకు, ఒంటరి మహిళలకు,నేత,గీత ,బీడీ కార్మికులకు 4000 రూపాయలు పెన్షన్ పెంచాలని కండరాల క్షీణత గల వారికి 15000 రూపాయలు ఇవ్వాలని డిమాండ్ చేశారు .

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వం వికలాంగులకు, చేయూత పెన్షన్ దారులకు వెంటనే పెన్షన్ పెంచి ఇవ్వాలనిమరియు కొత్త పింఛన్లను ఇవ్వాలని డిమాండ్ చేయడం జరిగింది. చేయూత పింఛన్ లను పెంచుతానని చెప్పి ముఖ్యమంత్రి అధికారంలోకి వచ్చిన తర్వాత మోసం చేస్తున్న నీకు రాజకీయంగా బుద్ధి చెబుతామని హెచ్చరించారు.ఈ కార్యక్రమంలో ఎమ్మార్పీఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి, లసిం గారి భూమయ్య మాదిగ, ఎంఎంఎస్ జిల్లా సీనియర్ నాయకురాలు, సావిత్రి మాదిగ, ఆఫీజ, బాలమణి, స్వర్ణలత, హైమది, సునీత, చంద్రకళ, గంగారం,తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.