ఎడపల్లి అంగన్వాడి కేంద్రంలో సీమంతాలు చిన్నారి బాలబాలికలకు అన్న ప్రసాదం
– ఐసిడిఎస్ సూపర్వైజర్ సావిత్రి
ఎడపల్లి, సెప్టెంబర్ 20 ( లోకంతీరు ) : చిన్నారి పసి పిల్లల పట్ల తల్లులు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని, అప్పుడే పిల్లలు ఆరోగ్యవంతంగా ఉంటారని ఐసిడిఎస్ బోధన్ ప్రాజెక్ట్ ఎడపల్లి మండల పర్యవేక్షకురాలు సావిత్రి అన్నారు.శనివారంఎడపల్లి మండల కేంద్రంలోని వీణ (ఆరవ) అంగన్వాడి కేంద్రంలో పోషణ మాసం కార్యక్రమాలను ఏర్పాటు చేశారు. కార్యక్రమానికి పర్యవేక్షకురాలు సావిత్రి హాజరయ్యారు.ఈ సందర్భంగా ఆమె గర్భిణీ మహిళలకు, బాలింతలకు ఆరోగ్యం పట్ల పలు సలహాలు సూచనలు చేశారు. మహిళలు గర్భిణి దాల్చినప్పటి నుండి ప్రసవం అయ్యేంతవరకు ఆతర్వాత ప్రసవం అయిన తర్వాత పుట్టిన బిడ్డకు ముర్రపాలు తప్పక పట్టించాలన్నారు. తల్లిపాలే బిడ్డకు శ్రేయస్కరం అన్నారు. రోగ నిరోధక శక్తి పెరుగుతుందన్నారు. తల్లిపాలల్లో ఎలాంటి కల్తి ఉండబోవని ఆమె గుర్తు చేశారు. బయట పాలల్లో కల్తీ ఉండవచ్చు అని అలాంటి పాలను చిన్నారి బాలబాలికలకు పట్టకూడద న్నారు. మహిళా గర్భిణిలు, బాలింతలు ఆరోగ్యంగా ఉండడానికి ఆకుకూరలు కాయగూరలతో పాటు అంగన్వాడి కేంద్రంలో అందజేస్తున్న బాల అమృతం, పౌష్టికహరాన్ని తప్పకుండా తీసుకోవాలన్నారు. పసి పిల్లలకు తల్లి పాలిచ్చే ముందు పిల్లలు ఒడిలో పెట్టుకొనిఎలాంటి ఆలోచనలకు తావివ్వకుండా పసిపిల్లలపై దృష్టి సారించి పాలు ఇవ్వాలన్నారు.అప్పుడే పసిపిల్లలకు తల్లిపై ప్రేమ అభిమానాలు, అనురాగాలు కలుగుతాయనిఆమె గుర్తుచేశారు.బిడ్డను మూడు సంవత్సరాల వరకు తల్లి కాపాడుకోవాల్సిన బాధ్యతలు ఉంటాయన్నారు. అంగన్వాడి కేంద్రంలో నమోదైన పిల్లలందరికీ కేంద్రానికి సంబంధించిన అంగన్వాడి ఉపాధ్యాయులు పౌష్టిక ఆహారంతో పాటు బాలామృతం, పిల్లల ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ తీసుకోవడం జరుగుతుందన్నారు.అంతేకాకుండా గర్భిణ మహిళలకు ,బాలింతలకు కూడా అంగన్వాడి కేంద్రంలో
పౌష్టికాహారo, పాలు, గుడ్లు పంపిణీ అందజేయడం జరుగుతుందన్నారు. సెప్టెంబర్ 17వ తారీకు నుండి అక్టోబర్ 16వ తారీకు వరకు ప్రతి అంగన్వాడి కేంద్రాలలో పోషణ మాసం కార్యక్రమాలను నిర్వహిస్తున్నట్లు పర్యవేక్షకురాలు సావిత్రి తెలిపారు. గర్భిణి మహిళలకు కేంద్రంలో సీ మంతాలు, చిన్నారి పసిపిల్లలకు అన్న ప్రసాద కార్యక్రమాలను నిర్వహించారు. ప్రతి అంగన్వాడి కేంద్రంలో పోషణ వనాన్ని పెంపకం చేసుకోవాలన్నారు. ఆరు బయట దొరికే ఆహార పదార్థాలలో కల్తీ ఎక్కువ గా ఉంటుందన్నారు.అందుకే తమ ఇంటిలో, అంగన్వాడి కేంద్ర ఆవరణంలో పోషణ వనం పెంచుకున్నట్లయితే బాగుంటుందని ఆమె అన్నారు. మూడు సంవత్సరాల నుండి ఐదు సంవత్సరాలలోపు ఉన్న చిన్నారి బాలబాలికలకు ఆరు బయట తినుబండరాలను తల్లిదండ్రులు తినిపించకూడదు అన్నారు. పిల్లలు అనారోగ్యానికి గురవుతారని ఆమె గుర్తు చేశారు. ఏది ఏమైనప్పటికీ ప్రతి అంగన్వాడి కేంద్రాలలో పోషణ మాసం కార్యక్రమాలను ప్రతి అంగన్వాడి కేంద్రం ఉపాధ్యాయులు తప్పనిసరిగా నిర్వహించాలని అన్నారు. కార్యక్రమంలో అంగన్వాడి ఉపాధ్యాయులు ఏకే తులసి, వీణ, సౌమ్య, సుజాత, నాగమణి, గంగామణి, రాజేశ్వరి, స్థానిక మహిళలు ఆండాలు, గర్భిణి మహిళలు తదితరులు పాల్గొన్నారు.