Take a fresh look at your lifestyle.

పల్లె దవాఖానను ప్రారంభించిన ఎమ్మెల్యే సుదర్శనన్ రెడ్డి……

0

పల్లె దవాఖానను ప్రారంభించిన ఎమ్మెల్యే సుదర్శనన్ రెడ్డి

ఎడపల్లి, అక్టోబర్ 24 ( లోకంతీరు ) :          ఎడపల్లి మండలంలోనికుర్నాపల్లి గ్రామంలో బోధన్ ఎమ్మెల్యేకు ఘన స్వాగతం తెలిపారు కుర్నపల్లి గ్రామంలో శుక్రవారం పల్లె ప్రగతి దవకాలను ప్రారంభోత్సవానికి విచ్చేసిన బోధన్ ఎమ్మెల్యే పొద్దుటూరి సుదర్శన్ రెడ్డికి ఎడపల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఆసుపత్రి వైద్యాధికారులు సిబ్బంది, స్థానిక కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు ఘనంగా స్వాగతించి పూలబోకినందించి సన్మానం చేశారు.

బోధన్ ఎమ్మెల్యేకు బిపి చెకప్

కుర్నపల్లిలో శుక్రవారం పల్లె దవఖాన ప్రారంభోత్సవానికి విచ్చేసి ప్రారంభోత్సవం చేసిన అనంతరం ఎమ్మెల్యే పొద్దుటూరి సుదర్శన్ రెడ్డికి పల్లె దవఖాన ఆసుపత్రి ఎం ఎల్ హెచ్ పి, శైలజ తో పాటు ఏఎన్ఎం శాంత వైద్యులు బోధన్ ఎమ్మెల్యే పొద్దుటూరి సుదర్శన్ రెడ్డికి బీపీ చెక్అప్ నిర్వహించారు. ఎమ్మెల్యే పొద్దుటూరు సుదర్శ న్ రెడ్డి ఆరోగ్యంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే పొద్దుటూరు సుదర్శన్ రెడ్డి ఎడపల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యులతో పాటు సిబ్బందిని ఆశ వర్కర్లను వారి పనితీరు పట్ల అభినందించారు. ఇలాగే పల్లె ప్రాంతంలోని ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాలని ఆయన సూచించారు. అనంతరం ఇందిరమ్మ ఇండ్లు మంజూరైన లబ్ధిదారులకు ఎమ్మెల్యే ఇంటి పట్టాలను అందజేశారు. కార్యక్రమంలో జిల్లా గ్రంధాలయ శాఖ అధ్యక్షులు అంతిరెడ్డి రాజిరెడ్డి, ఎడపల్లి మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు పులి శ్రీనివాస్ రావు,ఎస్సీ సెల్ జిల్లా అధ్యక్షులు ఈరాంటి లింగం, జిల్లాయువజన కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి కొండ్ర సంజయ్, సీనియర్ నాయకులు గాంధారి హనుమంత్ రెడ్డి, చంద్రశేఖర్ రెడ్డి, గాంధారి అనిల్ రెడ్డి, రవీందర్ రెడ్డి, జైతాపూర్ సహకార సంఘం అధ్యక్షులు, బోధన్ ఏఎంసి డైరెక్టర్ కరటూరి సత్యనారాయణ, నెహ్రూ నగర్, ఎడపల్లి గ్రామాల మాజీ సర్పంచులు అమానుల షరీఫ్, శంకర్ నాయుడు, ఎల్లయ్య యాదవ్, మండలంలోని ఆయా గ్రామాల కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు, హెచ్ ఓ సవిత, ఏడపల్లి ప్రా థమికఆరోగ్య కేంద్రం వైద్యాధికారి వినీత్ కుమార్ రెడ్డి, ఆయుష్ విభాగం వైద్యాధికారి వెంకటేష్,సూపర్వైజర్లు రాజేశ్వర్, దేవేందర్, ఆసుపత్రి వైద్య సిబ్బంది, ఏఎన్ఎం లు, ఆశ వర్కర్లు, ఎడపల్లి మండల స్థాయి సంబంధిత శాఖల అధికారులు, తహసిల్దార్ దత్తాద్రి, ఎంపీడీవో శంకర్, స్థానిక గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.