జైతాపూర్ గ్రామంలో ఘనంగా బోనాల పండుగ

ఎడపల్లి , నవంబర్ 30 ( లోకంతీరు ) : ఎడపల్లి మండలం జైతాపూర్ గ్రామంలో ఆదివారం గ్రామ ప్రజలు బోనాల పండుగను ఘనంగా నిర్వహించారు ఎల్లమ్మ మందిరం ఐదు సంవత్సరాల హార్షికోత్సవం శ్రీ మహాలక్ష్మి ఆలయం మొదటి వార్షికోత్సవం సందర్భంగా మహిళా భక్తులు మంగళ హారతులతో భాజా భజంత్రీల మధ్యఈ వేడుక ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా గ్రామంలోని పోచమ్మ ముత్యాలమ్మ పెద్దమ్మ ఎల్లమ్మ మహాలక్ష్మి దేవతలకు భక్తులు బోనాలు సమర్పించి పిల్ల పాప పాడిపంట బాగుండాలని మొక్కులు తీర్చుకున్నారు గ్రామంలో ఆధ్యాత్మిక శోభ వెలీ విరిసింది