Take a fresh look at your lifestyle.

ప్రభుత్వ పాఠశాలలో నాణ్యమైన విద్య…..

0

ప్రభుత్వ పాఠశాలలో నాణ్యమైన విద్య

– విద్యాశాఖ అధికారి శివలింగాలప్ప

ఎడపల్లి , అక్టోబర్ 24 ( లోకంతీరు ) :  ప్రభుత్వ పాఠశాలల్లోనే మెరుగైననాణ్యమైన విద్య బోధన జరుగుతుందని,గ్రామీణ ప్రాంత ప్రజలు ప్రభుత్వ పాఠశాలలోకి తమ పిల్లలను పంపించే విధంగా చూడాలని ఎడపల్లి మండల విద్యాశాఖ అధికారి శివలింగ్గాలప్ప అన్నారు. ఎడపల్లి మండలంలోనిమంగల్పహాడ్ ప్రాథమిక పాఠశాలను ఆయన సందర్శించి ప్రార్ధన సమయంలో పాల్గొన్నారు. అనంతరం పాఠశాల విద్యార్థిని విద్యార్థులను పరిచయం చేసుకున్నారు. ప్రభుత్వ పాఠశాలలో అనుభవజ్ఞులైన ఉపాధ్యాయులు ఉన్నందున చదువుకునే విద్యార్థిని విద్యార్థులకు మెరుగైన విద్యా బోధనతో పాటు ఆటపాటలను నేర్పుతున్నట్లు ఆయన తెలిపారు. విద్యార్థుల్లో దాగి ఉన్న సృజనాత్మకతను వెలికి తీసేందుకు ఉపాధ్యాయులు కృషి చేస్తున్నారన్నారు.మండలంలోని ప్రభుత్వ ఉన్నతప్రాథమిక పాఠశాల లో సమయపాలన పాటిస్తూ ఉపాధ్యాయులు విద్యా బోధన చేస్తున్నారని ఆయన తెలిపారు.అలాగే మండలంలో 12 జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో చదువుకుంటున్న విద్యార్థిని విద్యార్థులకు ఉదయం, సాయంకాలం ప్రత్యేక తరగతులను నిర్వహిస్తున్నట్లు తెలిపారు.ఇందుకు ప్రభుత్వ ఆదేశాలు సైతం తమకు వచ్చాయన్నారు. ప్రతి ఒక ఉన్నత పాఠశాలలో చదువుకుంటున్న విద్యార్థునీ విద్యార్థులు 100% శాతం ఉత్తీర్ణులు అయ్యే విధంగా ఉపాధ్యాయులు విద్య బోధన చేస్తున్నారని ఆయన వివరించారు. నిత్యం మండలంలోని ప్రతి పాఠశాలను సందర్శించి ఉపాధ్యాయుల పనితీరును పరిశీలిస్తున్నట్లు తెలిపారు. మంగల్ పహాడ్ ప్రాథమిక పాఠశాల ,ఉపాధ్యాయుల పని తీరు పట్ల ఆయనసంతృప్తివ్యక్తంచేశారు.ఆయన పాఠశాలప్రధానోపాధ్యాయురాలు,వరలక్ష్మి, ఉపాధ్యాయులు సురేష్ ఉన్నారు.

Leave A Reply

Your email address will not be published.