క్రికెట్ టోర్నీ రిజిస్ట్రేషన్లకు నవంబర్ 2 చివరి తేదీ
ఎడపల్లి, నవంబర్ 01 ( లోకంతీరు) : సే నో టు డ్రగ్స్. సే ఎస్ టూ స్పోర్ట్స్ నినాదంతో బోధన్ రూలర్ పోలీస్ శాఖ ఆధ్వర్యంలో టెన్నిస్ బాల్ క్రికెట్ టోర్నమెంట్ ను నిర్వహిస్తున్నారు రూరల్ ఎస్సై మచ్చెందర్ రెడ్డి పర్యవేక్షణలో నవంబర్ ఐదు నుంచి జానకంపేట లోని సి టి సి గ్రౌండ్ లో ఈ టోర్నమెంట్ ప్రారంభమవుతుంది క్రికెట్ టోర్నమెంట్. లో ఆసక్తిగల యువకులు బోధన్ ఎడపల్లి రెంజల్ పోలీస్ స్టేషన్ లో నవంబర్ 2 వరకు రిజిస్ట్రేషన్లు చేసుకోవచ్చు మొదటి విజేతకు 25 వేల రూపాయలు రన్నర్ ఆఫ్ కు 11 వేల ఒక వంద 16 రూపాయలు నగదు బహుమతి ఇస్తారు కావున ఆసక్తి గలవారు మీ దగ్గరలో ఉన్న పోలీస్ స్టేషన్ లో అప్లై చేసుకోవచ్చు.