Take a fresh look at your lifestyle.

పోలీస్ శాఖ ఆద్వర్యంలో 150 సంవత్సరాల వందేమాతరం గీతం ఆలవన వేడుకల నిర్వహణ…..

0

పోలీస్ శాఖ ఆద్వర్యంలో 150 సంవత్సరాల వందేమాతరం గీతం ఆలవన వేడుకల నిర్వహణ

– పోలీస్ కమిషనర్ వెల్లడి

నిజామాబాద్, నవంబర్ 07 ( లోకంతీరు ) : నేడు ఉదయం 10:00 గం॥లకు పోలీస్ పరేడ్ గ్రౌండ్ యందు నిజామాబాద్ పోలీస్ కమీషనర్ పి.సాయి చైతన్య, ఐ.పి.యస్. ఆధ్వర్యంలో 150 సంవత్సరాల వందేమాతరం గీతం వేడుకలు ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా పోలీస్ కమిషనర్ గారు భారతమాత ఫోటోకు పూలమాలలు వేసిన అనంతరం, పోలీస్ కమిషనర్ గారు మాట్లాడుతూ ఈ పదం మన ప్రతి భారతీయుడి గుండెల్లో దేశభక్తి జ్వాల రగిలించే శక్తిని కలిగి ఉంది. బంకించంద్ర చట్టోపాధ్యాయ గారు రచించిన ఈ గీతం 150 సంవత్సరాలు పూర్తి చేసుకున్న ఈ సందర్భం మనందరికీ గర్వకారణం. ఈ గీతం మన స్వాతంత్య్ర సమరయోధులకు ప్రేరణ గా నిలిచినట్లే, నేటి తరం యువతకు దేశప్రేమ కర్తవ్యనిష్ట ఐక్యత అనే విలువలను స్ఫూర్తిగా అందిస్తుంది. ఈ మహోత్సవ సందర్భంగా మన దేశపు తల్లి భూమికి మనమందరం వందనం చేయాలి. “వందేమాతరం ” అని ఆలపించడం కేవలం ఒక గీతం పాడడం కాదు, అది మన తల్లి దేశానికి ఇచ్చే గౌరవ ప్రధమైన ప్రమాణం అని తెలియజేశారు.ఈ సందర్భంగా అదనపు డి.సి.పి (ఎ.ఆర్) రామ చందర్ రావ్ ,ఆఫీస్ సూపరింటెండెంటులు శంకర్, బషీర్, రిజర్వు ఇన్స్పెక్టర్స్ శ్రీనివాస్, తిరుపతి మరియు, సి.సి.ఆర్.బి సిబ్బంది, పోలీస్ కంట్రోల్ రూమ్ సిబ్బంది, సెంట్రల్ కాంప్లెంటు సెల్ సిబ్బంది మరియు డి.పి.ఓ సిబ్బంది, హెడ్క్వార్టర్స్ సిబ్బంది, హోమ్ గార్డ్సు సిబ్బంది హజరుకావడం జరిగింది.

Leave A Reply

Your email address will not be published.