Take a fresh look at your lifestyle.

అంగరంగ వైభవంగా సర్ సివి రామన్ జయంతి…..

0

అంగరంగ వైభవంగా సర్ సివి రామన్ జయంతి

ఎడపల్లి, నవంబర్ 07 ( లోకంతీరు ) :  ఎడపల్లి మండల పరిధిలోని తెలంగాణ గురుకుల బాలికల పాఠశాల కళాశాలలో శుక్రవారం సివి రామన్ జయంతిని పురస్కరించుకొని ప్రభుత్వ ఉన్నత పాఠశాల విద్యార్థిని విద్యార్థులకు రంగోలి, క్విజ్. జానపద గేయాలు పోటీలను నిర్వహించారు.పాఠశాల కరస్పాండెంట్ గంగా శంకర్ కార్యక్రమానికి సభాధ్యక్షులుగా వ్యవహరించారు. మండల స్థాయిలో ని ఆయా ఉన్నత పాఠశాలల విద్యార్థులు, విద్యార్థినిలు పాల్గొన్నారు. పై పోటీలో గెలుపొందిన విద్యార్థిని విద్యార్థులకు వక్తలు బహుమతులను అందజేశారు . ఈ సందర్భంగా కళాశాల పాఠశాల ప్రిన్సిపాల్ గంగ శంకర్, విశ్రాంత ప్రధానోపాధ్యాయులు విజయ ఆనంద్ కుమార్ మాట్లాడారు. పాఠశాలల విద్యార్థిని విద్యార్థులు పివి రామన్ ను ఆదర్శంగా తీసుకొని ఆయన అడుగుజాడల్లో నడుచుకోవాలన్నారు. రంగోలి పోటీల్లో ప్రథమ బహుమతిని జానకంపేట ఉన్నత పాఠశాల విద్యార్థి రఘువీర్ గెలుపొందగా, ద్వితీయ బహుమతిని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఎడపల్లి విద్యార్థిని శృతి గెలుచుకున్నారు. తృతీయ బహుమతిని మంగళపాడు ఉన్నత పాఠశాల విద్యార్థి కారుణ్య గెలుపొందారు. క్విజ్ పోటీల్లో ప్రథమ స్థానంలో జిల్లా పరిషత్ పాఠశాల జానకంపేటవిద్యార్థిని రమేసా ప్రథమ స్థానంలో నిలువగా, రెండవస్థానంలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల మంగలపాడు విద్యార్థిని బహుమతి తృతీయ స్థానంలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల జాన్కంపేట విద్యార్థి రాజకుమార్ గెలుపొందారు. జానపద గేయాల పోటీల్లో టి ఎస్ ఆర్ జెసి పాఠశాల విద్యార్థిని రమణి ప్రథమ స్థానంలో నిలువగా, ద్వితీయ స్థానంలో ఎడపల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థిని బహుమతి గెలుపొందారు, తృతీయ స్థానంలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థి తేజమ్మాయి బహుమతి గెలుపొందడంతో ముఖ్య పైన పేర్కొన్న పోటీల్లో గెలుపొందిన విద్యార్థిని విద్యార్థులకు బహుమతులను అందజేశారు.ఈ పోటీలలో మండలంలోని ఐదు గ్రామాల ఉన్నత పాఠశాల విద్యార్థి విద్యార్థులు పాల్గొన్నట్లు పాఠశాల ప్రిన్సిపాల్ గంగా శంకర్ తెలిపారు. ఏది ఏమైనాపటికి సి.వి.రామన్ జయంతి సందర్భంగా నిర్వహించిన పోటీల్లో విద్యార్థులు పొందడం ఆనందంగా ఉందన్నారు కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు, బాలికలు తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.