Take a fresh look at your lifestyle.

అన్ని రెవెన్యూ సమస్యలు పరిష్కరించాలి…..

0

అన్ని రెవెన్యూ సమస్యలు పరిష్కరించాలి

– జిల్లా కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి

ఎడపల్లి, నవంబర్ 11 ( లోకంతీరు ) :  జిల్లా వ్యాప్తంగా తహసిల్దార్ కార్యాలయాలలో పెండింగ్లో ఉన్న భూ సమస్యల పరిష్కరించే దిశగా పని చెయ్యాలని జిల్లా కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి అన్నారు. మంగళవారం ఎడపల్లి తాసిల్దార్ కార్యాలయం ఆయన ఆకస్మికంగా తనిఖీ చేసిన అనంతరం రికార్డులను పరిశీలించారు. అనంతరం కలెక్టర్ మాట్లాడారు. 2020 సంవత్సర కాలంలో భూ భారతి కింద దరఖాస్తులు 220 దరఖాస్తులు వచ్చినట్లు ఆయన తెలిపారు. ప్రస్తుతం మొన్నటి వరకు భూభారతిలో 840 దరఖాస్తులు వచ్చినట్లు కలెక్టర్ వివరించారు.సాదా బైనామ కింద 51 దరఖాస్తుల రాగా, రెవెన్యూ సదస్సులో 51 దరఖాస్తులు ఏడ పల్లి తాసిల్దార్ కార్యాలయానికి వచ్చినట్లు ఆయన పేర్కొన్నారు. తాహసిల్దార్ కార్యాలయానికి వచ్చిన దరఖాస్తులను క్షున్నంగా పరిశీలించి రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఒక్కొక్కటి పరిష్కరించే దిశగా అధికారులు పనిచేయాలని జిల్లా కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి ఎడపల్లి తాసిల్దార్ కార్యాలయ అధికారులను ఆదేశించారు.రైతుల నుంచి వచ్చిన దరఖాస్తులను పెండింగ్ లో ఉంచకుండా ఎప్పటికప్పుడు పరిష్కరించే దిశగా ప్రత్యేక దృష్టి సారించాలన్నారు.ఎడపల్లి తహసిల్దార్ కార్యాలయ అధికారులు సిబ్బంది పనితీరు పట్ల జిల్లా కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి సంతృప్తి వ్యక్తం చేశారు. తాసిల్దార్ కార్యాలయానికి రైతులు వస్తే వారి సాధకబాదాకాలు విని వారికి న్యాయం చేసేలా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ అధికాలను ఆదేశించారు. జిల్లా కలెక్టర్ వినయ్ కృష్ణ రెడ్డి, అదనపు కలెక్టర్ కిరణ్ కుమార్, బోధన్ సబ్ కలెక్టర్ వికాస్ మహతో, ఎడపల్లి తాసిల్దార్ దత్తాద్రి, ఉప తాహసిల్దార్ అనూష, ఎంపీడీవో శంకర్, తాహసిల్దార్ కార్యాలయ, అధికారులు ,సిబ్బంది, ఆయా గ్రామాల రైతులు ఉన్నారు.

Leave A Reply

Your email address will not be published.