Take a fresh look at your lifestyle.

బర్దిపూర్ గ్రామ బిఆర్ఎస్ నేతల భారీగా కాంగ్రెస్ చేరిక

0

బర్దిపూర్ గ్రామ బిఆర్ఎస్ నేతల భారీగా కాంగ్రెస్ చేరిక

నిజామాబాద్ రూరల్, డిసెంబర్ 05 ( లోకంతీరు ) : నిజామాబాద్ రూరల్ నియోజకవర్గం డిచ్ పల్లి మండలం బర్దిపూర్ గ్రామంలో రాజకీయ వేడి పెరిగింది. బిఆర్ఎస్, కీలక నాయకులు సహా 50 మంది ఒక్కసారిగా కాంగ్రెస్ పార్టీలో చేరి గ్రామ రాజకీయాల్లో మార్పు తెచ్చారు. నిజామాబాద్ రూరల్ క్యాంప్ కార్యాలయంలో శుక్రవారం నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపతి రెడ్డి కండువా కప్పి వారిని ఘనంగా పార్టీలోకి ఆహ్వానించారు.

రూరల్ ఎమ్మెల్యే భూపతి రెడ్డి మాట్లాడుతూ….
“కాంగ్రెస్ పేదల పార్టీ. అందిస్తున్న సంక్షేమ పథకాలతో రాష్ట్రవ్యాప్తంగా ప్రజలు, నాయకులు మా వైపు ఆకర్షితులవుతున్నారు” అని అన్నారు. ఎస్టిలకు అన్ని సౌకర్యాలు, రిజర్వేషన్లు కల్పించిన పార్టీ కాంగ్రెస్ పార్టీ అని అన్నారు. ఇందిరమ్మ ఇండ్లు, ఉచిత రేషన్ కార్డు, ఉచిత సన్న బియ్యం, 200 యూనిట్ల ఉచిత కరెంటు, మహిళలకు వడ్డీ లేని రుణాలు, రైతు బీమా, రుణమాఫీ, రైతు భరోసా వంటి పథకాలే కాంగ్రెస్ బలోపేతానికి కారణమని పేర్కొన్నారు.గత ప్రభుత్వాలు కమిషన్ల రాజకీయాలు చేసి ప్రజలకు న్యాయం చేయలేదని విమర్శించిన ఎమ్మెల్యే, రాబోయే బర్దిపూర్ సర్పంచ్ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థిని భారీ మెజార్టీతో గెలిపించాలని పార్టీ కార్యకర్తలకు పిలుపునిచ్చారు.నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే భూపతి రెడ్డి సమక్షంలో, కాంగ్రెస్ పార్టీ సర్పంచ్ అభ్యర్థి వెంకట్ రెడ్డి,మాజీ సర్పంచ్ నారాయణ రెడ్డి నేతృత్వంలో బి ఆర్ ఎస్ సీనియర్ నాయకులు సిరికొండ సుభాష్ రెడ్డి, మన్నే గోపాల్, బాల్రెడ్డి, కానుకరాజు, గంగారెడ్డి, తదితరులు కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు.కార్యక్రమంలో నారాయణ రెడ్డి,భాగరెడ్డి,రాంరెడ్డి,జితేందర్ నిరేడి దాస్,నర్సయ్య,దేవరాజ్,రవి,సురేష్ తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.