భగవద్గీత శ్లోకాలతో ఆకట్టుకుంటున్న నాలుగేళ్ల చిన్నారి విహాన్సీ గౌడ్

ఎడపల్లి, డిసెంబర్ 23 ( లోకంతీరు ) : ఎడపల్లి మండలం మంగళ్ పాడ్ గ్రామానికి చెందిన ఆనగోని అరుణ్ గౌడ్. భావన దంపతుల నాలుగు సంవత్సరాల చిన్నారి విహాన్సీ గౌడ్ చిన్న వయసులోనే భగవద్గీత శ్లోకాలను చెబుతూ అందరిని ఆకట్టుకుంది ఈ వీడియోలు సామాజిక మధ్యమంలో వైరల్ కావడంతో పలువురు చిన్నారుల తో పాటు వారి తల్లిదండ్రులు అభినందిస్తున్నారు ఆ చిన్నారి బోధన్ లోని ఓ ప్రైవేట్ పాఠశాలలో ఎల్ కె జి చదువుతుంది మంగల్ పాడ్ గ్రామస్తులు ఆ చిన్నారిని అభినందిస్తున్నారు ప్రతి ఇంట్లో హిందూ బంధువులందరూ చిన్నపిల్లలకు ఇప్పటినుండి భగవద్గీత నేర్పించాలని తెలుపుతున్నారు.